
రామోజీ గ్రూప్ సంస్థల అధినేత, స్వర్గీయ రామోజీరావు కుటుంబ సభ్యులను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయన నివాసానికి వెళ్లిన సీఎం.. రామోజీరావు చిత్రపటానికి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీఎం రేవంత్ వెంట మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితర నేతలు ఉన్నారు. కాగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ జూన్ 08వ తేదీ శనివారం రోజున రామోజీరావు తుదిశ్వాస విడిచారు. రామోజీరావు అంత్యక్రియలను తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించింది.