మూసీ ప్రక్షాళన అడ్డుకుంటే.. ఆ ఈశ్వరుడే చూసుకుంటడు: సీఎం రేవంత్

మూసీ ప్రక్షాళన అడ్డుకుంటే.. ఆ  ఈశ్వరుడే చూసుకుంటడు: సీఎం రేవంత్

మూసీ ప్రక్షాళను అడ్డుకుంటే ఆ ఈశ్వరుడే  చూసుకుంటాడని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మూసీ ఓడ్డున మంచిరేవులలో శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయానికి శంకుస్థాపన చేసిన సీఎం.. ఈశ్వరుడి ఆశీర్వాదంతో మూసీ ప్రక్షాళన మొదలు పెట్టామని.. ఆరు నూరైనా మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని చెప్పారు.మూసీ ప్రక్షాళన బాధ్యతతో కాదు పవిత్రంగా చేస్తామన్నారు.ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా దైవ సంకల్పంతో  ముందుకెళ్తామన్నారు సీఎం

సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

  • ఇంత గొప్ప కార్యక్రమం చేసే అదృష్టం మాకు దక్కింది. 
  • 1400 ఏళ్ల నాటి ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నాం
  • గొప్ప చరిత్రను భవిష్యత్ తరాలకు అందించేందుకు కృషి చేస్తాం
  • మూసీ ప్రక్షాళన భాద్యతతో కాదు పవిత్రంగా చేస్తాం..
  • ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా దైవ సంకల్పంతో  ముందుకెళ్తాం
  • మూసీ ప్రక్షాళనకు ఉమ్మడి రాష్ట్రంలో ప్రయత్నాలు జరిగాయి
  • రెండు నదులను ప్రక్షాళన చేయాలని ప్రణాళికలు చేశాం
  •  సముద్రం ఒడ్డులేని రాష్ట్రం మన తెలంగాణ.
  • నదులు కలుషితం అవుతున్నాయి
  • మానవ తప్పిదం వల్లే నదులు కాలుష్యం అవుతున్నాయి. 
  • గొప్ప చరిత్ర ఉన్న  సిటీ కాలుష్యంతో మసకబారిపోతోంది
  • కాలుష్యంతో ఢిల్లీలో స్కూలు,ఆఫీసులు మూతపడుతున్నాయి.
  • పొల్యూషన్ కారణంగా రాష్ట్రాల్లో పెట్టుబడులు తరలిపోతున్నాయి
  • ముచికుందా నదికి కూడా గొప్ప చరిత్ర ఉంది
  • మూసా,ఈసా పరివాహక ప్రాంతాన్ని బాగు చేస్తాం
  • ఈశ్వరుడి ఆశీర్వాదంతో మూసీ ప్రక్షాళన మొదలు పెట్టాం
  • అడ్డంకులను సృష్టిస్తే ఈశ్వరుడే చూసుకుంటాడు
  • అద్శుతమైన ఆర్థిక ధ్యాన కేంద్రంగా మారుస్తున్నాం
  • ఏడాదంతా పారేలా గోదావరి నీటిని తరలిస్తున్నాం
  • 8 నెలల క్రితమే 20 టీఎంసీల గోదావరి నీటి తరలింపు పనులు ప్రారంభం
  • మూసీ ప్రక్షాళన నిత్యావసరం కంటే కూడా అత్యవసరం
  • మూసీ కాలుష్యంతో నల్గొండ ప్రజలు గోసలు పడుతున్నారు
  • భువనగిరి ఏరియాల్లో మూసీ పొల్యూషన్ తో జనం అల్లాడుతున్నారు
  • ఆ ప్రాంతంలో యువకులకు పెళ్లిల్లు కూడా కావడం లేదు
  • పిల్లలకు కూడా వైకల్యంతో పుడుతున్నారు
  • కొంత మంది స్వార్థంతో మూసీ ప్రక్షాళన అడ్డుకుంటున్నారు.
  • మూసీ ప్రక్షాళన ఆపాలని ఓ మహిళా నేత ఎన్జీటీలో పిటిషన్ వేశాడు
  • ఈ ప్రాంత ప్రజల అండగా 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు
  • ఈ ప్రాంత అభివృద్ధి ఆ మహిళా నేతకు పట్టదా.?
  • మీ కుమారుడు వేసిన కేసును విత్ డ్రా చేసుకోవాలి
  • ఆ అక్క మనసు ఎట్ల ఒప్పుకున్నదో .. ఇలాంటి తప్పుడు కేసులను వేయించడానికి 
  • ఆ అక్కకి ఈ ప్రాంత ప్రజలు ఓట్లు వేయలేదా?
  • వాళ్ల కుటుంబాన్ని ఆశీర్వదించలేదా
  • ఈ రోజు ఈ రాష్ట్రంలో, దేశంలో ఆ అక్కకు, వాళ్ల కుటుంబానికి గుర్తింపు వచ్చింది 
  • ప్రజా ప్రతినిధులుగా, మంత్రులుగా పదవులు అనుభవించారంటే ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదం కావాలి
  • ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను అడ్డుకోవడానికి నీ కన్న కొడుకే ఎన్జీటీలో కేసు వేస్తుంటే.. ప్రజా ప్రతినిధిగా కొనసాగడానికి నీకు అర్హత ఉందా?
  • సావాస దోషం వల్ల మంచి వాళ్లతో ఉంటే మంచిగ ఉంటం.. చెడు స్నేహం చేస్తే చెడిపోతరని పెద్దలు చెప్తుంటరు
  • మంచోళ్లకు పది రూపాయలు ఇచ్చి దగ్గరికి తెచ్చుకోవాలి.. చెడ్డోళ్లను పది రూపాయలతో వదిలించుకోవాలి
  • ఈ చిన్న సూత్రం ఆ అక్కకు అర్థం కావటం లేదా అని అడుగుతున్న
  • ఈ ప్రాజెక్టును ఆపడానికి నీ పుత్రరత్నం వేసిన కేసును వెంటనే తక్షణమే ఉపసంహరించుకోండి
  • లేకపోతే ఈ ప్రజలు మీ కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేసే పరిస్థితి వస్తుంది.. అంత దూరం రానియ్యొద్దు
  • వారి వెనకాల ముసుగు తొడుక్కొని దాక్కున్న వాళ్లకు కూడా చెప్తున్న
  • మీ వళ్ల కాని పనులు చాలా మేము చేస్తున్నం.. మీరు ఇట్లనే ఉంటే ఆ హోదా కూడా మిగలదు
  • ఇలాంటి చిల్లర మల్లర ప్రయత్నాలు ఆపేయాలి
  •  
  •