‘గ్లెండేల్‌‌’ స్టూడెంట్స్ కు సీఎం సన్మానం

‘గ్లెండేల్‌‌’ స్టూడెంట్స్ కు  సీఎం సన్మానం

గండిపేట, వెలుగు: సింగపూర్‌‌లో ఇటీవల జరిగిన గ్లోబల్‌‌ ఎక్సలెన్స్‌‌ డే(జీఈడీ) 2025లో మిడిల్‌‌ స్కూల్‌‌ విభాగంలో సన్‌‌ సిటీలోని గ్లెండేల్‌‌ అకాడామీ స్టూడెంట్స్​ గోల్డ్​మెడల్​ సాధించారు. వీరిని బుధవారం సీఎం రేవంత్​రెడ్డి అభినందించి సన్మానించారు. గ్రీన్‌‌ గ్లెన్‌‌ గార్డియన్స్‌‌ బృందంలో ఆరో తరగతి విద్యార్థులు ఆరాధ్య దుద్దిల్ల శ్రీపాదరావు, నిగమా పెన్మెట్సా, సయ్యద్‌‌ అలిజా జైఆమా, ఏడో తరగతి విద్యార్థులు రాహిని సమ్హిత వర్మ దంతులూరి, జేడెన్‌‌ డి రోజారియో ఉన్నారు. వీరు ది గుడ్‌‌ పుడ్‌‌ మూవ్‌‌మెంట్‌‌ ప్రాజెక్టును కైజెన్‌‌ అనే అంశం కింద ప్రదర్శించారు. అకాడమీ డైరెక్టర్‌‌ మిను సలూజా పాల్గొన్నారు.