ఖమ్మం రూరల్, వెలుగు : సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 18న ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా నర్సింగ్ కాలేజీ, మద్దులపల్లిలో అగ్రికల్చర్ మార్కెట్‌ను ప్రారంభించడంతో పాటు జేఎన్‌టీయూ నిర్మాణానికి, కూసుమంచిలో 100 పడకల హాస్పిటల్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అధికారిక కార్యక్రమాల అనంతరం సీపీఐ శతాబ్ది ఉత్సవాలకు హాజరుకానున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ పి.శ్రీజ ఆఫీసర్లను ఆదేశించారు.
బుధవారం సీపీ సునీల్‌దత్, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. జిల్లాలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారీ సీఎంకు వివరించేందుకు సిద్ధం కావాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట మంత్రి పొంగులేటి ఆఫీస్ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్‌రెడ్డి, ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్ రాంప్రసాద్ పాల్గొన్నారు.
