
హైదరాబాద్ బేగంపేటలో సీఎం క్యాంప్ ఆఫీస్ లో పంచాయతీ రాజ్ శాఖపై సమీక్ష జరిపారు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. పంచాయతీ రాజ్ శాఖపై అధికారులతో రివ్యూ చేశారు. అక్టోబర్ 5 లేదా అక్టోబర్ 6 నుంచి గ్రామాలు, పట్టణాల్లో 60 రోజుల ప్రణాళికతో కార్యక్రమాలు అమలు చేయాలని సూచించారు. డిసెంబర్ మొదటి వారం వరకు… కొత్త పంచాయతీ రాజ్ చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించే అంశంపై చర్చించారు.