కల్తీ సారా ఘటనలో 37కు పెరిగిన మృతులు..

కల్తీ సారా ఘటనలో 37కు పెరిగిన మృతులు..

చెన్నై: తమిళనాడు కల్తీ సారా ఘటనలో మృతుల సంఖ్య 37కు పెరిగింది. 55 మంది ఆస్పత్రి పాలయ్యారు. వీరిలో 18 మందిని పుదుచ్చేరిలోని జిప్ మర్ కు, ఆరుగురిని సేలంలోని హాస్పిటల్ కు తరలించారు. బాధితుల్లో ఎక్కువ మంది కరుణాపురం ప్రాంతానికి చెందిన వారు ఉన్నారు. ఈ ఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. కల్తీ సారా తాగడంతోనే ఈ మరణాలు చోటు చేసుకున్నాయని తెలిపారు. వారు ప్రైవేటు వ్యక్తుల నుంచి మద్యం కొని తాగినట్టు గుర్తించామని పేర్కొన్నారు. అయితే, విషపూరితమైన మెథనాల్ తో కూడిన మద్యాన్ని బాధితులు తాగారని ఫోరెన్సిక్ దర్యాప్తులో తేలిందని ప్రభుత్వం పేర్కొంది. ఈ కేసును ప్రభుత్వం సీబీసీఐడీకి ట్రాన్స్ ఫర్ చేసింది. బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది.  గురువారం సీఎం స్టాలిన్ ఈ ఘటనపై ట్వీట్ చేశారు. ‘‘నిందితులను అరెస్టు చేశాం. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకున్నాం. ప్రజలు కల్తీ సారా అమ్మేటోళ్లపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీస్కుంటాం”అని తెలిపారు.