కొడంగల్, వెలుగు: సీఎంఆర్ఎఫ్పేదలకు వరమని కాంగ్రెస్పార్టీ కొడంగల్ఇన్చార్జి ఎనుముల తిరుపతిరెడ్డి అన్నారు. మంగళవారం కడా ఆఫీస్లో 365 మంది లబ్ధిదారులకు రూ.2 కోట్ల విలువైన సీఎంఆర్ఎఫ్చెక్కులు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు.
కొడంగల్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కడా స్పెషల్ ఆఫీసర్వెంకట్ రెడ్డి, జిల్లా లైబ్రరీ చైర్మన్రాజేశ్రెడ్డి, నాయకులు అంబయ్యగౌడ్, శేఖర్, ముస్తాక్తదితరులున్నారు.
