ప్రజల ఆరోగ్యానికి ఆర్థిక భరోసా సీఎంఆర్ఎఫ్: ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

ప్రజల ఆరోగ్యానికి ఆర్థిక భరోసా సీఎంఆర్ఎఫ్: ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

మొగుళ్లపల్లి, వెలుగు: పేదల ఆరోగ్యానికి ఆర్థిక భరోసా సీఎం సహాయ నిధి అని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం మొగుళ్లపల్లి మండలంలో పలు గ్రామాలకు చెందిన 69 మంది బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందన్నారు. సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయాన్ని బాధితులకు అందిస్తున్నామని చెప్పారు. 

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఎంతోమంది నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశామని, మండలంలో రూ.20 కోట్లకు పైగా సీఎంఆర్ఎఫ్ నిధులు అందించామని తెలిపారు. ప్రజా ప్రభుత్వానికి ప్రజల దీవెనలు ఉండాలని కోరారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీఏసీఎస్​ చైర్మన్ సంపెల్లి నర్సింగరావు, చిట్యాల ఏఎంసీ వైస్ చైర్మన్ రఫీ, పీఏసీఎస్​వైస్ చైర్మన్ శ్రీనివాస్, ఎంపీడీవో సురేందర్, టీపీసీసీ అధికార ప్రతినిధి అశోక్, కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ కుమార్, జనరల్ సెక్రటరీ రాము, జిల్లా నాయకుడు రాజు, టౌన్ ప్రెసిడెంట్ రమేశ్, నాయకులు పాల్గొన్నారు.

దొంగే దొంగా.. దొంగా.. అని అరిచినట్లు ఉంది

ఇసుక అమ్ముకున్న వ్యక్తి.. దొంగే దొంగా.. దొంగా... అని అరిచినట్లు ఉందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణారావు ఎద్దేవా చేశారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలకేంద్రంలోని రైతు వేదికలో 49 మంది లబ్ధిదారులకు 15.58 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్​ చెక్కులను ఆదివారం పంపిణీ చేశారు. అనంతరం పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే 'కామన్​ సర్వీస్​ సెంటర్​'ను  ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో వెంకటరమణారెడ్డి నియోజకవర్గంలో ఇసుక దోపిడీకి పాల్పడడంతో అతడిపై నాలుగు కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ విషయాన్ని అప్పుడే మర్చిపోయి.. ప్రెస్​మీట్లు పెట్టి మమ్మల్ని విమర్శించడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, టీపీసీసీ అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బుచ్చిరెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.