తగ్గిన సీఎన్జీ గ్యాస్‌ ధరలు

తగ్గిన సీఎన్జీ గ్యాస్‌ ధరలు

న్యూఢిల్లీ : కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ), పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ) ధరలు తగ్గాయి. ఈ కొత్త రేట్లు ఆదివారం నుంచి అమల్లోకి వచ్చాయి. కొవిడ్ -19 మహమ్మారితో బాధపడుతున్న ప్రజలకు శనివారం ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ ధరలు తగ్గించడం కాస్తా ఊరట లభించినట్లయింది. సహజ వాయువు ధరలను 25 శాతం తగ్గించడం వల్ల సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలు తగ్గించారు.

ఢిల్లీలో సీఎన్జీ ధరను రూ.1.53 తగ్గించగా.. ఇప్పుడు కిలోకు రూ.42.70 వద్ద లభిస్తుంది. నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లలో దీని ధరలు రూ.1.70 తగ్గి కిలోకు రూ.48.38 వద్ద లభిస్తుంది. ముజఫర్‌నగర్‌లో దీని ధర కిలోకు రూ.56.55గా ఉన్నది. కర్నాల్ మరియు కైతాల్‌లో కిలోకు రూ.50.68 కు విక్రయిస్తున్నారు. రేవారి, గురుగ్రామ్‌లలో సీఎన్జీ ధర ఇప్పుడు కిలోకు రూ.53.20, కాన్పూర్ జిల్లాలో రూ.59.80 కు అమ్ముతున్నారు.

పైపుల నుంచి అందించబడిన పీఎన్జీ ధరను కూడా తగ్గించారు. ఢిల్లీలో దీని ధర ఎస్సీఎంకు రూ.1.55 నుంచి రూ.27.50 కు తగ్గించబడింది. అదేవిధంగా, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లో పీఎన్జసీ ధర ఎస్సిఎమ్‌కు రూ.7.45 గా ఉంది. కర్నాల్, రేవారిలో దాని ధరలు 65 పైసలు తగ్గి రూ.27.55 కు చేరాయి. ప్రతి ఆరునెలలకు ఒకసారి సహజ వాయువు ధరలు నిర్ణయించబడతాయి. సహజ వాయువు ధరలు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1, అక్టోబర్ 1 న నిర్ణయిస్తారు