- కాంగ్రెస్ నుంచి 20 మంది ఆశావహులు
- ఐదు స్థానాల్లో రెండింటి కోసం మజ్లిస్ పట్టు
- 21తో ముగియనున్న దరఖాస్తుల గడువు
- నేడు నగర పార్టీ నేతలతో మహేశ్ గౌడ్ మీటింగ్
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కోఆప్షన్పదవుల భర్తీకి రిలీజైన నోటిఫికేషన్ కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల్లో పొలిటికల్ హీట్ పుట్టించింది. కాంగ్రెస్ నుంచి ఈ పోస్టులు ఆశిస్తున్న వారి సంఖ్య 20 దాటడంతో సర్దుబాటు చేయడం పార్టీ సీనియర్లకు తలనొప్పిగా మారింది. మిత్రపక్షమైన మజ్లిస్ రెండు సీట్లు కావాలని పట్టుబడుతోంది. ఈ నెల 21 వరకు అప్లికేషన్లు అందజేయాల్సి ఉంది.
పోటీ తీవ్రంగా ఉండడంతో ఎంపిక వ్యవహారం టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ వద్దకు చేరింది. దీంతో నేడు నగర కాంగ్రెస్ నేతలతో చర్చించి ఎంపికను కొలిక్కి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మజ్లిస్‌కు ఎన్ని స్థానాలు ఇవ్వాలనే సంగతిని కూడా ఆయనే నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. ఏకాభిప్రాయంతో పదవులను ఏకగ్రీవం చేయాలని మహేశ్ గౌడ్ భావిస్తున్నారు. ఎన్నికజరిగే పరిస్థితి ఎదురైతే ఒక స్థానంలో పోటీ చేయాలని బీజేపీ ఆలోచిస్తోంది.
నేతల పోటీ
కార్పొరేషన్లో మొత్తం ఐదు కోఆప్షన్ పదవులున్నాయి. జనరల్ కేటగిరీలోని మూడు స్థానాల నుంచి ఒక మహిళను కచ్చితంగా ఎన్నుకోవాలి. మాజీ కార్పొరేటర్లు, సెంట్రల్, స్టేట్గవర్నమెంట్నుంచి గెజిటెడ్ హోదాలో రిటైరైన వారు, కనీసం మూడేండ్లు మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేసినవారు, లోకల్‌బాడీ సంస్థలో ప్రత్యేక పరిజ్ఞానం ఉన్న మరో ఇద్దరిని కోఆప్షన్ పదవులకు ఎన్నుకోవాలి. ఈ మూడు స్థానాలు పోను మిగితా రెండు కోఆప్షన్సీట్లను మైనారిటీ కేటగిరీకి రిజర్వ్ చేశారు. ఇందులో కూడా ఒక మహిళకు అవకాశం ఇవ్వాలి. కార్పొరేటర్లకు సమాన హోదాతో కోఆప్షన్‌సభ్యులు ఉంటారు.
కార్పొరేషన్లో మొత్తం 60 మంది కార్పొరేటర్లుండగా బీజేపీ నుంచి 28 మంది, కాంగ్రెస్‌నుంచి 17, ఎంఐఎంనుంచి 14, ఒకరు బీఆర్ఎస్కార్పొరేటర్ఉన్నారు. పరస్పర మద్ధతుతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను కాంగ్రెస్, మజ్లిస్ కలిసి దక్కించుకున్నాయి. కోఆప్షన్పదవుల్లోనూ అదే అవగాహనతో వెళ్లాలని రెండు పార్టీలు భావిస్తున్నాయి. కార్పొరేషన్ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిన ఏడుగురు నేతలు, టికెట్ల దక్కని మరో ఏడుగురు, ఐదుగురు మాజీ కార్పొరేటర్లు, కొత్తగా పార్టీలో చేరిన మరో ఇద్దరు కోఆప్షన్రేస్లో ఉన్నారు. వీరి మధ్య రాజీ కుదర్చడానికి స్థానిక నేతలు తలలు పట్టుకుంటున్నారు.
కీలకం కానున్న మీటింగ్
మున్సిపల్లో ఐదు పదవులుండగా అన్నే అప్లికేషన్లు వస్తే ఎన్నిక ఏకగ్రీవమవుతుంది. కానీ అంతకంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే కార్పొరేటర్ల ఓటింగ్ నిర్వహిస్తారు. పదవులు ఆశిస్తున్న నేతల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఎలక్షన్ జరుగొచ్చని అంచనా వేస్తున్న బీజేపీ.. తమకున్న 28 మంది బలంతో ఒక సీటుకు పోటీ చేయాలనుకుంటోంది.
కానీ ఇందుకు చాన్స్ఇవ్వకుండా మజ్లిస్‌కు ఒక స్థానాన్ని కేటాయించే ప్రతిపాదన ముందు పెట్టి, కుదరని పక్షంలో అడిగిన రెండు సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. మిగితా స్థానాలను ఆశావహుల మధ్య ఏకాభిప్రాయంతో యునానిమస్చేయాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు మహేశ్గౌడ్నేతృత్వంలోని హైదరాబాద్‌లో జరిగే మీటింగ్‌పై సర్వాత్రా ఆసక్తి నెలకొంది.

