
ఇంగ్లండ్: ఇంగ్లండ్ టూర్లో ఉన్న భారత జట్టులో కరోనా కలకలం రేపింది. టీం ఇండియా హెడ్ కోచ్ రవి శాస్త్రికి కరోనా పాజిటివ్‌గా తేలింది. శనివారం నుంచి కాస్త అస్వస్థకు గురైన ఆయన.. ఆదివారం కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఆ పరీక్షల్లో రవి శాస్త్రికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అదేవిధంగా బౌలింగ్ కోచ్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్, ఫిజియోథెరపిస్ట్ నితిన్ పటేల్‌లకు కూడా కరోనా లక్షణాలు ఉన్నట్లు తెలిసింది. దాంతో వారికి కూడా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేశారు. రిజల్ట్స్ వచ్చేవరకు వారందరినీ జట్టుకు బీసీసీఐ దూరంగా ఉంచింది.