బొగ్గు బ్లాక్‌‌లను సింగరేణికే కేటాయించాలి

బొగ్గు బ్లాక్‌‌లను సింగరేణికే కేటాయించాలి
  •  జీఎం ఆఫీస్‌‌ ఎదుట టీబీజీకేఎస్‌‌ ధర్నా

గోదావరిఖని, వెలుగు: తెలంగాణలోని బొగ్గు బ్లాక్‌‌లను వేలం వేయకుండా సింగరేణి సంస్థకే కేటాయించాలని టీబీజీకేఎస్‌‌ లీడర్లు డిమాండ్‌‌ చేశారు. ఈ మేరకు శనివారం సాయంత్రం సింగరేణి ఆర్జీ 1 జీఎం ఆఫీస్‌‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, టీబీజీకేఎస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ మాదాసు రామమూర్తి మాట్లాడారు. ఒడిశా, గుజరాత్‌‌, తమిళనాడు రాష్ట్రాలకు కేటాయించిన పద్ధతిలోనే సింగరేణికి కొత్త గనుల తవ్వకానికి పర్మిషన్‌‌ ఇవ్వాలని కోరారు. అనంతరం జీఎం చింతల శ్రీనివాస్‌‌కు వినతిపత్రం అందజేశారు. ధర్నా లీడర్లు వడ్డేపల్లి శంకర్, నూనె కొమురయ్య, పర్లపల్లి రవి పాల్గొన్నారు.

ప్రైవేట్‌‌ కంపెనీ కాంట్రాక్ట్‌‌ను రద్దు చేయాలి

ప్రైవేట్‌‌ సంస్థకు కేటాయించిన కోయగూడెం ఓపెన్‌‌ కాస్ట్‌‌ 3 బ్లాక్‌‌ను రద్దు చేసి సింగరేణికి ఇవ్వాలని గిరిజన ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు గోళ్ల రమేశ్‌‌, అధ్యక్షుడు బానోతు కర్ణ డిమాండ్‌‌ చేశారు. గోదావరిఖని ప్రెస్‌‌క్లబ్‌‌లో శనివారం మీడియాతో మాట్లాడారు. ఏజెన్సీ ఏరియాల్లో ప్రైవేట్‌‌ సంస్థలు మైనింగ్‌‌ చేసేందుకు వీలు లేదని సుప్రీంకోర్టు గతంలోనే చెప్పిందన్నారు. రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్‌‌ను ఉల్లంఘిస్తూ కోయగూడెం ఓసీ 3 బ్లాక్‌‌ను ప్రైవేట్‌‌ సంస్థకు కేటాయించడం సరికాదన్నారు. సమావేశంలో ఎం.సుజిత్, కె.కళాధర్, జి.సురేశ్, బి.చరణ్‌‌ తేజ్‌‌, ఎల్‌‌. రవికుమార్‌‌, బి.ప్రవీణ్‌‌, బి.భాస్కర్‌‌ పాల్గొన్నారు.