భద్రాద్రి కొత్తగూడెం: కోల్ ఇండియా స్థాయి వార్షిక క్రీడా పోటీల షెడ్యూల్‌ను గురువారం విడుదల చేశారు. బొగ్గు పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులు, అధికారులు ఈ పోటీల్లో పాల్గొంటారు. సింగరేణితో పాటు ఈసీఎల్, బీసీసీఎల్, ఎన్‌ఈసీఎల్, సీసీఎల్, ఎస్‌ఈసీఎల్, ఎంసీఎల్, డబ్ల్యుసీఎల్, సీఎంపీడీఐఎల్, ఎన్‌సీఎల్, సీఐఎల్ సంస్థల క్రీడాకారులు పోటీపడనున్నారు.
వివిధ క్రీడలకు ఆయా బొగ్గు సంస్థలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. బాడీబిల్డింగ్, వెయిట్‌లిఫ్టింగ్, పవర్‌లిఫ్టింగ్ పోటీలను అక్టోబర్‌లో సింగరేణి నిర్వహించనుంది. ఈ పోటీల వేదికపై సింగరేణి యాజమాన్యం త్వరలో నిర్ణయం తీసుకోనుంది.
