టికీ– టాకా 2.0.. మెస్సీ, రొనాల్డోలను వణికించిన స్పెయిన్ మాస్టర్ ప్లాన్ ఇదేనా?

టికీ– టాకా 2.0.. మెస్సీ, రొనాల్డోలను వణికించిన స్పెయిన్ మాస్టర్ ప్లాన్ ఇదేనా?

 Spain Football: ఫుట్‌బాల్ ప్రపంచంలో స్పెయిన్ (La Roja) జట్టుకు ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంది. ప్రత్యర్థి ఎంతటి బలమైన జట్టు అయినా, వారిని మైదానంలో కదలనివ్వకుండా పూర్తిగా అలసిపోయేలా చేసి.. ఆపై వేటాడటం స్పెయిన్ నైజం. ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజాలు లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో, కైలియన్ ఎంబాపే వంటి వారైనా సరే.. స్పెయిన్‌తో మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఒక్క గోల్ కోసం, కనీసం బంతి కోసం పరితపించేలా చేసే వ్యూహం అది. ఆ చారిత్రాత్మక వ్యూహం పేరే టికీ-టాకా (Tiki-Taka). 2010 ప్రపంచకప్‌తో పాటు ఎన్నో ప్రతిష్టాత్మక టైటిళ్లను స్పెయిన్‌కు అందించిన ఈ వ్యూహానికి, ఈ 2026 వరల్డ్ కప్‌లో సరికొత్త హంగులు అద్ది ఎలా విశ్వవిజేతగా నిలిచిందో ఇప్పుడు V6 వెలుగు వైబ్ సైట్ లో చూద్దాం.. 

అసలేంటి ఈ టికీ-టాకా?: 
ఈ వ్యూహం యొక్క ముఖ్య ఉద్దేశం ఒక్కటే – మ్యాచ్ జరుగుతున్నంత సేపూ బంతి ప్రత్యర్థికి దొరకకూడదు, అది కేవలం మన ఆధీనంలోనే (Possession) ఉండాలి.. మైదానంలో ప్లేయర్స్ త్రిభుజాకారంలో (Triangles) తక్కువ దూరంలో ఉంటూ.. ఒకరికొకరు చాలా వేగంగా, చిన్న చిన్న పాస్‌లు ఇచ్చుకుంటారు. బంతి కోసం ప్రత్యర్థి ఆటగాళ్లు మైదానమంతా పరిగెత్తి పూర్తిగా అలసిపోయేలా చేస్తారు. మైదానంలోని ఖాళీ ప్రదేశాలను వాడుకుంటూ ప్రత్యర్థి డిఫెన్స్‌ను బ్రేక్ చేస్తారు. 1988–96 మధ్యలో బార్సిలోనా జట్టు దీనిని ఎక్కువ ప్రాచుర్యంలోకి తెచ్చింది. 2008 నుంచి 2012 మధ్య కాలంలో స్పెయిన్ జట్టును ప్రపంచంలోనే అత్యంత దుర్భేద్యమైన జట్టుగా మార్చింది ఈ వ్యూహమే.

సంక్షోభంలో పాత ఆయుధం: 
కాలక్రమేణా ప్రత్యర్థి జట్లు కూడా టికీ–టాకాకు విరుగుడు కనిపెట్టాయి. స్పెయిన్ ఆటగాళ్లకు గోల్ కొట్టే అవకాశం ఇవ్వకుండా పటిష్టమైన డిఫెన్స్ (Low Block) నిర్మించుకుని, వారిని కవ్వించి మ్యాచ్‌లను పెనాల్టీ షూటౌట్ వరకు లాగడం ప్రారంభించాయి. దీనివల్ల స్పెయిన్ కేవలం మైదానంలో అత్యధిక పాస్‌లకే పరిమితమై, గోల్స్ చేయలేక తీవ్రంగా ఇబ్బంది పడింది. ఫలితంగా 2018, 2022 ప్రపంచకప్ టోర్నీల నుంచి స్పెయిన్ చాలా త్వరగా నిష్క్రమించాల్సి వచ్చింది.

పాత ప్లాన్ కి కొత్త టచ్: కోచ్ మాస్టర్ క్లాస్: 
టికీ-టాకా పని అయిపోయిందనుకున్న తరుణంలో.. స్పెయిన్ కొత్త కోచ్ లూయిస్ ఫుయెంటె రంగంలోకి దిగి ఈ వ్యూహాన్ని పూర్తిగా రీబూట్ చేశారు. కేవలం టైమ్ వేస్ట్ చేస్తూ పాస్‌లు ఇచ్చుకోవడం కాకుండా, ప్రత్యర్థి మోహరింపుల్లోని గ్యాప్‌లను స్పాట్ చేసి నేరుగా దాడులు చేయడం (Direct Attack) పై దృష్టి పెట్టారు. దీనికోసం లామిన్ యమాల్, నికో విలియమ్స్ వంటి వేగవంతమైన యువ వింగర్లను రంగంలోకి దించారు. ఈ సరికొత్త వ్యూహం 2026 వరల్డ్ కప్‌లో అద్భుత ఫలితాలను ఇచ్చింది. స్పెయిన్ ఆడిన 8 మ్యాచ్‌లలో ఏకంగా 14 గోల్స్ సాధించగా, ప్రత్యర్థికి కేవలం ఒక్కటంటే ఒక్క గోల్ మాత్రమే ఇచ్చింది. టోర్నీలో స్పెయిన్ సృష్టించుకున్న అవకాశాల ప్రకారం వారి ఎక్స్‌పెక్టెడ్ గోల్స్ (xG) రేషియో 17.48 గా ఉంది (అంటే వారు కనీసం 17–18 గోల్స్ చేయాల్సింది). ఈ జాబితాలో ఫ్రాన్స్, అర్జెంటీనా కంటే స్పెయిన్ చాలా ముందుంది. 

ALSO READ : అర్జెంటీనా ఓటమి తర్వాత స్కలోనీ బిగ్ హింట్.. 

2026 వరల్డ్ కప్ లో పాస్‌ల వర్షం: 
ఈ ప్రపంచకప్‌లో అత్యధిక పాస్‌లు చేసిన ఆటగాళ్ల జాబితా చూస్తే స్పెయిన్ ఈ వ్యూహాన్ని ఎంత పక్కాగా అమలు చేసిందో అర్థమవుతుంది. టోర్నమెంట్ మొత్తంలో స్పెయిన్ జట్టు ఏకంగా 4,945 పాస్‌లను విజయవంతంగా పూర్తి చేయగా, రన్నరప్ అర్జెంటీనా జట్టు 4,699 పాస్‌లు చేసింది.

టోర్నీలో టాప్-3 స్థానాలు స్పెయిన్ ఆటగాళ్లవే:
* రోడ్రి (కెప్టెన్) - 747 పాస్‌లు
* పావ్ క్యూబార్సి (డిఫెండర్) - 668 పాస్‌లు
* అయ్మెరిక్ లాపోర్టే (డిఫెండర్) - 618 పాస్‌లు