హాలీవుడ్ మాస్టర్ మైండ్ క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన విజువల్ వండర్ ‘ది ఒడిస్సీ’ (The Odyssey) గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. యూనివర్సల్ పిక్చర్స్ అధికారిక లెక్కల ప్రకారం.. సుమారు రూ.2,080 కోట్ల ($250 మిలియన్లు) భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, రిలీజైన మొదటి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.2,546 కోట్లు ($264.1 మిలియన్లు) కొల్లగొట్టింది. కేవలం 48 గంటల్లోనే వంద శాతం బడ్జెట్‌ను వెనక్కి రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.
‘ది ఒడిస్సీ’ వరల్డ్ వైడ్ రికార్డులు:
నోలన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్: ఫస్ట్ వీకెండ్‌లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.2,546 కోట్ల ($264.1 మిలియన్లు) వసూళ్లు సాధించిన ఈ చిత్రం, నోలన్ గత చిత్రం 'ది డార్క్ నైట్ రైజెస్' ఓపెనింగ్ రికార్డును అధిగమించింది. అంతేకాదు, కేవలం 48 గంటల్లోనే తన రూ.2,080 కోట్ల ($250 మిలియన్లు) బడ్జెట్‌ను పూర్తిగా రికవరీ చేసి అరుదైన ఘనత సాధించింది.
అమెరికాలో రికార్డు కలెక్షన్లు: అమెరికా, కెనడా మార్కెట్లలో రూ.1,200 కోట్లు ($124.5 మిలియన్లు) వసూలు చేసి, నోలన్ కెరీర్‌లోనే అతిపెద్ద డొమెస్టిక్ ఓపెనింగ్‌గా నిలిచింది. అలాగే 2026లో విడుదలైన లైవ్-యాక్షన్ చిత్రాల్లో అత్యధిక ఓపెనింగ్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఇదే సమయంలో ఈ ఏడాది ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ చిత్రంగా కూడా నిలిచింది.
Christopher Nolan’s #TheOdyssey has earned $264.1M globally over the weekend, marking the biggest worldwide opening of Nolan’s career
— Variety (@Variety) July 19, 2026
• The epic opened ahead of 2012’s “The Dark Knight Rises” ($249M) and 2008’s “The Dark Knight” ($198M)
• “The Odyssey” opened in 73… pic.twitter.com/Iw67ucdzo1
IMAX రికార్డులు: పూర్తిగా IMAX కెమెరాలతో చిత్రీకరించిన తొలి ఫీచర్ ఫిల్మ్‌గా నిలిచిన 'ది ఒడిస్సీ'.. ప్రపంచవ్యాప్తంగా కేవలం IMAX స్క్రీన్ల నుంచే రూ.482 కోట్లకు పైగా ($50 మిలియన్లు) వసూలు చేసి నోలన్ కెరీర్‌లో మరో రికార్డు నమోదు చేసింది. అలాగే R-రేటెడ్ చిత్రాల విభాగంలో 'డెడ్‌పూల్ & వోల్వరీన్', 'డెడ్‌పూల్ 2' తర్వాత ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఓపెనింగ్ సాధించిన మూడో చిత్రంగా నిలిచింది.
ఇండియా రికార్డులు:
ఇండియాలో తొలి రోజే రూ.17.40 కోట్ల నెట్, రూ.20 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ‘ది ఒడిస్సీ’.. నోలన్ గత చిత్రం ‘ఓపెన్‌హైమర్’ తొలి రోజు రికార్డును అధిగమించింది. అంతేకాకుండా ఇండియాలో అత్యధిక ఓపెనింగ్ సాధించిన హాలీవుడ్ చిత్రాల జాబితాలో చోటు దక్కించుకుంది.
మూడు రోజుల్లో దేశవ్యాప్తంగా రూ.61.30 కోట్ల నెట్, రూ.73.19 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ముఖ్యంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో IMAX షోలు ముందుగానే హౌస్‌ఫుల్ కావడం విశేషం. ఇండియాలో ఒక హాలీవుడ్ చిత్రానికి IMAX ఫార్మాట్‌లో నమోదైన అతిపెద్ద ఓపెనింగ్‌గా 'ది ఒడిస్సీ' చరిత్ర సృష్టించింది. ముందు ముందు ఇంకెన్ని రికార్డులు కొల్లగొడుతుందో చూడాలి
