కోల్‌‌‌‌ ఇండియా లాభం డౌన్‌‌

కోల్‌‌‌‌ ఇండియా లాభం డౌన్‌‌

న్యూఢిల్లీ: ఈ ఏడాది మార్చితో ముగిసిన క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో కోల్ ఇండియాకు రూ. 5,527.62 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్‌‌‌‌) వచ్చింది. కిందటేడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో వచ్చిన రూ.6,715 కోట్లతో పోలిస్తే ఈసారి కంపెనీ లాభం 17.7 శాతం తగ్గింది. కోల్ ఇండియా ప్రొడక్షన్‌‌‌‌ ఈ ఏడాది మార్చి 31 నాటికి 7 శాతం పెరిగి 224.16 మిలియన్ టన్నులకు చేరుకుంది. షేరుకి రూ. 4 ఫైనల్ డివిడెండ్ ఇచ్చేందుకు కంపెనీ బోర్డు డైరెక్టర్లు ఆమోదం తెలిపారు.

 కంపెనీ గతంలో షేరుకి రూ.15, షేరుకి రూ.5.25 చొప్పన రెండు సార్లు ఇంటెరిమ్‌‌‌‌ డివిడెండ్ ఇచ్చింది. కోల్ ఇండియా సేల్స్ ఈ ఏడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో రూ.35,161.44 కోట్లుగా నమోదయ్యాయి. కిందటేడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో ఈ నెంబర్‌‌‌‌‌‌‌‌ రూ.29,985.45 కోట్లుగా రికార్డయ్యింది. కంపెనీ ఉద్యోగులు 47 శాతం వరకు శాలరీ హైక్ ఇవ్వాలని ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే.

 కేవలం  3 శాతం మేర పెంచుతామని కోల్ ఇండియా ఆఫర్ ఇచ్చింది. కంపెనీ ఉద్యోగుల శాలరీల కోసం 2022–23 లో రూ.49,409 కోట్లు ఖర్చు చేసింది.