కోల్ ఇండియా లాభం రూ.9,069 కోట్లు

కోల్ ఇండియా లాభం రూ.9,069 కోట్లు

 న్యూఢిల్లీ : కోల్ ఇండియాకు  కిందటేడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ముగిసిన క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (క్యూ3) లో రూ.9,069.19 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్‌‌‌‌‌‌‌‌) వచ్చింది. అంతకు ముందు ఏడాదిలోని డిసెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చిన రూ.7,755.55 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది 16.9 శాతం ఎక్కువ. కంపెనీ రెవెన్యూ (కార్యకలాపాల నుంచి) రూ.35,169.33 కోట్ల నుంచి రూ.36,153.97 కోట్లకు ఎగసింది. కోల్ ఇండియా షేర్లు  సోమవారం సెషన్‌‌‌‌‌‌‌‌లో 5 శాతం పడి రూ.434 దగ్గర సెటిలయ్యాయి. దేశంలోని బొగ్గు ఉత్పత్తిలో కోల్ ఇండియా వాటా 80 శాతం.