బొగ్గు గని కార్మికులు,ఉద్యోగులకు ఒకే డ్రెస్​కోడ్..ఈ ఏడాది నుంచే రూ.12,500 చెల్లింపు

బొగ్గు గని కార్మికులు,ఉద్యోగులకు ఒకే డ్రెస్​కోడ్..ఈ ఏడాది నుంచే రూ.12,500 చెల్లింపు
  • కోల్ ఇండియా మీటింగ్ లో నిర్ణయం
  • సింగరేణిలోనూ ఇవ్వాలని కార్మిక సంఘాల డిమాండ్ 

కోల్​బెల్ట్, వెలుగు: దేశవ్యాప్తంగా బొగ్గు గనుల ఉద్యోగులతో పాటు ఆఫీసర్లకు ఇకముందు ఒకే రకమైన డ్రెస్​కోడ్​అమలు కానుంది. మంగళవారం న్యూఢిల్లీలో  సీఐఎల్​చైర్మన్​పీఎల్ ప్రసాద్​నేతృత్వంలో  కోల్ ఇండియా అపెక్స్​ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా 2025-–26 ఆర్థిక సంవత్సరం కోల్ ఇండియా.. దాని అనుబంధ బొగ్గు పరిశ్రమలకు కేటాయించిన బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతతో పాటు పలు అంశాలపై చర్చించారు.

ఇందులో భాగంగా  కొత్తగా అమల్లోకి తీసుకురానున్న డ్రెస్​కోడ్​కు సంస్థ ఏడాదికి రూ.12,500 చెల్లింపునకు ఆమోదం తెలిపిందని సీఐటీయూ వేజ్​బోర్డు మెంబర్, సీఐటీయూ జనరల్​సెక్రటరీ మందా నర్సింగరావు తెలిపారు. కోల్ ఇండియాలో జరిగిన ఒప్పందాన్ని వెంటనే సింగరేణిలోనూ అమలు చేయాలని డిమాండ్​చేశారు. ఈ సమావేశంలో సీఐఎల్​హెచ్​ఆర్​డీ డైరెక్టర్​వినయ్​కుమార్, యూనియన్ ప్రతినిధులు నాథు లాల్ పాండే, రామేంద్రకుమార్, రామానందన్, కె. లక్ష్మారెడ్డి హాజరయ్యారని తెలిపారు.