నాణ్యమైన బొగ్గును సప్లై చేయాలి : బదావత్ వెంకన్న

నాణ్యమైన బొగ్గును సప్లై చేయాలి : బదావత్ వెంకన్న

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : వినియోగదారులకు నాణ్యమైన బొగ్గు సప్లై చేసే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోల్​ మూమెంట్​ ఎగ్జిక్యూటీవ్​ డైరెక్టర్​ బదావత్​ వెంకన్న పేర్కొన్నారు. కొత్తగూడెం ఏరియాలో శుక్రవారం ఆయన పర్యటించారు. జీఎం ఆఫీస్​లో పలు శాఖల ఆఫీసర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిర్దేశించిన విధంగా బొగ్గు ఉత్పత్తి చేయాలన్నారు. రోజు వారీ లక్ష్యాలను అధిగమిస్తూ ట్రాన్స్​పోర్టు చేయాలన్నారు. బొగ్గు ఉత్పత్తి, ట్రాన్స్​పోర్టు విషయంలో సేఫ్టీకి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. 

రైలు మార్గం ద్వారా జరుగుతున్న బొగ్గు వివరాలు, కాలుష్యం గురించి అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఏరియా జీఎం షాలెం రాజు, ఎస్వోటూజీఎం కోటిరెడ్డి, ఏరియా ఇంజినీర్​ సూర్యనారాయణ రాజు, ప్రహ్లాద్, సోమశేఖర్, మోహన్​రావు తదితరులు పాల్గొన్నారు.