బొగ్గు రవాణాలో రికార్డ్.. గోదావరిఖని సింగరేణి ఆర్జీ-1  కోల్ హ్యాడ్లింగ్ ప్లాంట్ 

బొగ్గు రవాణాలో రికార్డ్.. గోదావరిఖని సింగరేణి ఆర్జీ-1  కోల్ హ్యాడ్లింగ్ ప్లాంట్ 

గోదావరిఖని, వెలుగు: సింగరేణి ఆర్జీ–1 ఏరియాలోని కోల్​ హ్యాడ్లింగ్​ ప్లాంట్​ (సీహెచ్​పీ) బొగ్గు రవాణాలో రికార్డు సృష్టించింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో 51.84 లక్షల టన్నుల బొగ్గును 1,322 రైల్వే రేక్​ల ద్వారా రవాణా చేసి రికార్డు సృష్టించగా, తాజాగా 2025–-26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే51.92 లక్షల టన్నుల బొగ్గును 1,323 రైల్వే రేక్​ల ద్వారా రవాణా చేసి సరి కొత్త రికార్డును సృష్టించింది. మరో 10 రోజుల్లో 1,375 రైల్వే రేక్​లను రవాణా చేసి 122 శాతం వృద్ధి రేటుతో ముందుకెళ్తామని అధికారులు తెలిపారు. సీహెచ్​పీ నుంచి 2025–-26 ఆర్థిక సంవత్సరంలో కోల్​ లింకేజీ ద్వారా 30.57 లక్షల టన్నుల బొగ్గును రవాణా  చేయాలని సంస్థ టార్గెట్​ విధించింది. కానీ, ఈ టార్గెట్​ను 2025 నవంబర్​ నాటికే సాధించింది.