- పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ప్రశ్నకు కేంద్రం సమాధానం
న్యూఢిల్లీ, వెలుగు: గోదావరి నది ద్వారా రామగుండం నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ)కి బొగ్గు రవాణా చేయడం ఆర్థికంగా గిట్టుబాటు కాదని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ వెల్లడించారు. ఇది అదనపు భారంతో కూడుకున్నదని శుక్రవారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
ఎన్టీపీసీ రామగుండం ప్లాంట్‌కు ఆద్రియాల గనుల నుంచి బొగ్గు సరఫరాకు ఇప్పటికే ప్రత్యేకమైన ‘మెర్రీ-గో-రౌండ్’రైలు వ్యవస్థ అందుబాటులో ఉందని చెప్పారు. ఒకవేళ జల రవాణా చేపడితే గనుల నుంచి నదికి, నది నుంచి ప్లాంట్‌కు పదేపదే లోడింగ్, అన్‌లోడింగ్ చేయాల్సి ఉంటుందన్నారు. దీంతో సమయం వృధాతో పాటు అదనపు ఖర్చు అవుతుందనిపేర్కొన్నారు.
