అయస్కాంతంతో క్రేన్ పైభాగంలో అతికించి.. రూ.220కోట్ల విలువైన కొకైన్ అక్రమరవాణా

అయస్కాంతంతో క్రేన్ పైభాగంలో అతికించి.. రూ.220కోట్ల విలువైన కొకైన్ అక్రమరవాణా
  • పక్కా సమాచారంతో పట్టుకున్న కంటైనర్ కస్టమ్స్ అధికారులు

ఒడిశాలో భారీగా కొకైన్ పట్టుబడింది. జగత్ సింగ్ పూర్ జిల్లాలోని పారాదీప్ పోర్ట్ లో కార్గో షిప్ నుంచి 22 కిలోల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు కంటైనర్ షిప్ కస్టమ్స్ అధికారులు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ సుమారు రూ. 220 కోట్లు. 

కార్గోషిప్ ఇండోనేషియానుంచి  గురువారం (నవంబర్ 30)  పారాదీప్ కు చేరుకుందని.. అక్కడ నుంచి డెన్మార్క్ వెళ్లాల్సి ఉండగా.. తనిఖీల్లో కొకైన బయటపడిందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. 

ఓడలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా జరుగుతుందని భువనేశ్వర్ కస్టమ్స్ విభాగానికి ఇంటెలిజెన్స్ ఇన్ పుట్ నుంచి అందిన పక్కా సమాచారంతో సోదాలు చేయడగా 22 కిలోల కొకైన్ బయటపడింది. కొకైనా కనిపించకుండా పాలిథిన్ కవర్లతో చుట్టిన 22 ప్యాకెట్లను ఓడ క్రేన్ పై భాగంతో అయాస్కాంతంతో అతికించి అక్రమ రవాణా చేస్తున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో ఈ కొకైన విలువ కేజీ ధర రూ.10 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఏజెన్సీ స్మగర్లను ఇంకా గుర్తించలేదని తెలిపారు.