నీట్ పేపర్ లీక్ పై ఉద్యమించిన జెన్ జీపై కేసులు పెట్టటం..తప్పుగా మాట్లాడారని 25 ఏళ్ల యువతిపై క్రిమినల్ కేసు పెట్టటాన్ని తప్పుబట్టింది కాక్రోచ్ జనతా పార్టీ. అసభ్యకరంగా మాట్లాడితే పరువు నష్టం కేసు పెట్టాలి కానీ.. క్రిమినల్ కేసు నమోదు చేయటం ఏంటని ప్రశ్నించింది. దేశ యువతపై.. తప్పులను ప్రశ్నించే యువతపై క్రిమినల్ కేసులు పెట్టే ముందు.. పార్లమెంట్ లోని 50 శాతం మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని.. బీజేపీ పార్టీ నుంచి గెలిచిన 100 మంది ఎంపీలపై కేసులు ఉన్నాయని.. అలాంటి వాళ్లపై తమ అధికారాన్ని ఉపయోగించాలంటూ పోలీసులకు సూచించింది కాక్రోచ్ జనతా పార్టీ. తప్పుగా మాట్లాడినందుకే 25 ఏళ్ల ఓ యువతిపై క్రిమినల్ కేసు పెట్టటం ఏంటని ప్రశ్నిస్తూ.. దేశంలోని యువతపై బీజేపీ పార్టీ వేధింపులు వెంటనే.. తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధి సౌరవ్ దాస్.
ఢిల్లీ జంతర్ మంతర్ లో నిరసనల సందర్బంగా ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిందని రుచికా సింగ్‌పై నమోదైన ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. దీనిపై స్పందించిన కాక్రోచ్ పార్టీ ప్రతినిధి సౌరవ్ దాస్ తీవ్రంగా ఖండించారు. అభ్యంతరకరమైన ,అవమానకరమైన భాషను సహించకూడదు అయితే అటువంటి వ్యాఖ్యలపై క్రిమినల్ విచారణ జరపడం భావ ప్రకటనా స్వేచ్ఛను అణచివేస్తుందని దాస్ అన్నారు.
రుచికా సింగ మాట్లాడిన భాష తప్పుగా ఉండవచ్చు, అది ఎవరికైనా అభ్యంతరకరంగా ఉండవచ్చు, కానీ అలాంటి వ్యక్తులపై క్రిమినల్ కేసులు సరైంది కాదు.. ఇది భయానక వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇది ముఖ్యంగా యువతరానికి ఆందోళన కలిగించే విషయం అన్నారు. ఈ కేసు పోలీసు అధికారాల దుర్వినియోగానికి నిదర్శనం అని శుక్రవారం Xలో ఒక పోస్ట్‌లో రాశారు.
ALSO READ : భోగాపురం ఎయిర్‌పోర్ట్ నుంచి.. ఎయిరిండియా కొత్త ఫ్లైట్ షెడ్యూల్
రుచికా సింగ్‌పై క్రిమినల్ కేసులు పెట్టి అధికార దుర్వినియోగం చేయడం సరికాదు. అసభ్య పదజాలం వాడినందుకు క్రిమినల్ కేసు పెట్టారు..బాగానే ఉంది.. 50 శాతం లోక్‌సభ ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి, బీజేపీలో దాదాపు 100 మంది ఎంపీలపై ఉన్నాయి.. 25 ఏళ్ల యువతిపై కాదు..పోలీసులు తమ శక్తిని వారిపై కేంద్రీకరించాలని కోరారు..యువతపై వేధింపులు తక్షణమే ఆపాలని దాస్ డిమాండ్ చేశారు.
