కోడ్ చెఫ్ స్నాక్ డౌన్ కంటెస్ట్- 2021

కోడ్ చెఫ్ స్నాక్ డౌన్ కంటెస్ట్- 2021
  • విజేతలకు 10వేల డాలర్ల నగదు బహుమతులు ప్రకటించిన అన్‌ అకాడమీ
  • అక్టోబర్‌ 19 వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం

న్యూఢిల్లీ: కోడ్ చెఫ్ స్నాక్ డౌన్ కంటెస్ట్- 2021 బిగిన్ అయింది. అన్‌ అకాడమీ వినూత్నమైన మల్టీ రౌండ్‌ ప్రోగ్రామింగ్‌ పోటీ తమ 6వ ఎడిషన్‌ స్నాక్‌డౌన్‌ ను ఇవాళ ప్రకటించింది. విజేతలకు సుమారు 10వేల డాలర్ల నగదు బహుమతులు అందించనున్నారు. అన్ని పాఠశాలలు, కాలేజీ విద్యార్థులతో పాటుగా వర్కింగ్‌ ప్రొఫెషనల్స్ కు కూడా ఈ పోటీలో పాల్గొనే అవకాశం కల్పించారు. అక్టోబర్ 19 వరకు రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశం కల్పంచారు. 
స్నాక్‌డౌన్‌ను 2010వ సంవత్సరంలో కోడ్‌చెఫ్‌ ప్రారంభించింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ ప్రోగ్రామర్లు ఒకరితో ఒకరు పోటీపడటమే లక్ష్యంగా దీనిని ప్రారంభించారు. అయితే అన్‌అకాడమీ ఈ కోడ్‌ చెఫ్‌ కస్టోడియన్‌షిప్‌ను జూన్‌ 2020లో తీసుకుంది.
రిజిస్ట్రేషన్‌ మరియు షెడ్యూల్‌
స్నాక్‌డౌన్‌ 2021 కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఇవి వచ్చేనెల అక్టోబర్‌ 19వ తేదీ వరకు తెరిచి ఉంచుతారు. మొదటి ఆన్‌లైన్‌  క్వాలిఫయింగ్‌ రౌండ్‌ పోటీలు 14 అక్టోబర్‌ నుంచి 19 వరకూ జరుగుతాయి.  ఈ పోటీ గ్రాండ్‌ ఆన్‌లైన్‌ ఫైనల్‌ వచ్చే ఏడాది జనవరి 9వ తేదీన జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం స్నాక్‌డౌన్‌ 2021 ను  గత వెర్షన్‌ల మాదిరి కాకుండా  కరోనా మహమ్మారి కారణంగా వ్యకులకు మాత్రమే పోటీ నిర్వహిస్తారు. విజేతలకు 10000 డాలర్ల నగదు బహుమతులతోపాటు స్నాక్‌డౌన్‌ గోల్డ్‌ ట్రోఫీ  కూడా అందిస్తారు. మొదటి రన్నరప్‌ మరియు సెకండ్‌ రన్నరప్‌లు వరుసగా 7500 మరియు 5వేల డాలర్లను అందిస్తారు. వీటితో పాటుగా ట్రోఫీలు, మర్చండైజ్‌ కూడా ఉన్నాయి. టాప్‌ 10 ఇండియన్‌ ప్రోగ్రామర్లు మరియు 4 నుంచి 25  గ్లోబల్‌ ర్యాంక్‌ హోల్డర్లు నగదు బహుమతులు పొందే అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రోగ్రామర్లు స్నాక్‌డౌన్‌ 2021 వెబ్‌సైట్‌  చూడటంతో పాటుగా తమంతట తాముగా నమోదు చేసుకోవచ్చు.