సర్కార్ ​బడుల్లో కోడింగ్​ ట్రైనింగ్

సర్కార్ ​బడుల్లో కోడింగ్​ ట్రైనింగ్
  • స్టూడెంట్స్ కు ఈ –లెరిన్ంగ్ లో  ప్రత్యేక శిక్షణ
  • గ్రేటర్ పరిధిలోని 50 స్కూళ్లలో అమలు
  • విద్యాశాఖ పర్మిషన్ తో క్లాసులు కండక్ట్
  • ఆరు నుంచి పదో తరగతి స్టూడెంట్స్ కు ట్రైనింగ్
  • లెర్నింగ్ స్కిల్స్ ఫౌండేషన్, డెల్ టెక్నాలజీస్ సంయుక్తంగా ప్రోగ్రామ్స్


హైదరాబాద్, వెలుగు: ప్రస్తుతం అన్నిరంగాల్లో టెక్నికల్, కోడింగ్ స్కిల్స్ మస్ట్​గా అయ్యాయి. ప్రైవేట్ స్కూళ్లలో ప్రైమరీ నుంచే పిల్లలకు టెక్నికల్ స్కిల్స్ పై స్పెషల్​ క్లాసులు తీసుకుంటారు.  ఈ -ఎడ్యుకేషన్ కంపెనీలు కూడా కోడింగ్ కోర్సులను స్పెషల్ గా చెబుతుంటాయి. సర్కార్​స్కూళ్లలోని పిల్లలకు ఈ టెక్నాలజీని నేర్పించాలనే ఉద్దేశంతో నగరానికి చెందిన లెర్నింగ్ స్కిల్స్ ఫౌండేషన్, డెల్ టెక్నాలజీస్ సంయుక్తంగా ఈ కోడింగ్ ట్రైనింగ్ ప్రోగ్రాం స్టార్ట్ చేశాయి. విద్యాశాఖ పర్మిషన్​తో గతేడాది నుంచి ఈ కోడింగ్ సబ్జెక్ట్ పై సర్కారు స్కూళ్ల స్టూడెంట్స్ కు ట్రైనింగ్ ఇస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్ లోని 50 స్కూళ్లను సెలెక్ట్​ చేసుకుని జులై వరకు ఆన్​లైన్​లో క్లాసులు కండెక్ట్ చేశారు. రీ ఓపెన్ అయ్యాక ఫిజికల్ గా క్లాసులు చెబుతున్నారు.  సెలెక్ట్ చేసిన స్కూళ్లలో వారంలో ఒకరోజు కోడింగ్ క్లాసు కండక్ట్​ చేస్తారు. ఎన్జీవోలకు చెందిన రిసోర్స్ పర్సన్ వెళ్లి చెప్తారు. టీచర్లకు కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. 

స్టూడెంట్లు, టీచర్లకు.. 
సర్కార్​ స్కూళ్లలో చదివే పిల్లలకు కూడా టెక్నికల్ స్కిల్ డెవలప్ అవ్వాలని, ఎన్జీవోలు పలు యాక్టివిటీస్ నిర్వహిస్తున్నాయి. కోడింగ్ ట్రైనింగ్ తో పాటు స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటికల్) లో కొత్త కాన్సెప్ట్ లను స్టూడెంట్స్ కి నేర్పిస్తున్నారు. ఎన్జీవోల కు చెందిన సోర్స్ పర్సన్ వెళ్లి క్లాసులను నిర్వహించి స్టూడెంట్స్ కి థియరీ, ప్రాక్టికల్స్ లో ట్రైనింగ్ ఇస్తున్నారు. మరోవైపు మ్యాథ్స్, సైన్స్ టీచర్లకు కూడా ట్రైనింగ్​ ఇస్తున్నారు. ట్రైనింగ్ ఆరునెలల నుంచి ఏడాది ఉంటుంది. వారంలో ఒకరోజు ఉదయం థియరీ క్లాస్, సాయంత్రం ప్రాక్టికల్స్ ఉంటాయి.  స్కూల్ టైం టేబుల్ ని బట్టి క్లాసులను నిర్వహిస్తారు. సెలెక్ట్ చేసిన20 స్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేశారు. 

డిజిటల్​ క్లాసులు ఏర్పాటు చేసి..
లెర్నింగ్ స్కిల్స్ ఫౌండేషన్ 2008 నుంచి రాష్ర్టంలోని సర్కార్​బడుల్లోని స్టూడెంట్స్​లో స్కిల్స్ డెవలప్​కు కృషి చేస్తోంది. 2016లో నుంచి డిజిటల్ క్లాస్ రూమ్​లు ఏర్పాటు చేసి, టీచర్లకు కూడా ట్రైనింగ్ ఇస్తోంది. 2019 మార్చి తర్వాత ఎడ్యుకేషన్ డిజిటల్ కి మారగా ఆన్​లైన్ ​థియరీ క్లాసులు చెబుతున్నారు. ఎన్జీవోలు సిటీలోని స్కూళ్లను విజిట్ చేసి స్టూడెంట్స్​ సంఖ్య ఎక్కువగా ఉన్న వాటిని ఎంపిక చేసుకుంటాయి.  ఆ తర్వాత జిల్లా విద్యాశాఖ నుంచి  పర్మిషన్​ తీసుకుని ఆరు నుంచి పదో తరగతి క్లాసుల స్టూడెంట్స్​కు ట్రైనింగ్ ఇస్తున్నాయి . ప్రస్తుతం సిటీలో 20,  రంగారెడ్డి లో 20, మరో 10 రెసిడెన్షియల్ స్కూళ్లలో  కోడింగ్ ట్రైనింగ్ ఇస్తున్నాయి. అమీర్ పేట్, షేక్​పేట, మణికొండ, యూసఫ్ గూడ, అత్తాపూర్, కాటేదాన్ ఇలా పలు ప్రాంతాల్లోని సర్కార్​ హై స్కూల్స్ లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్​నడుతుస్తున్నాయి. 


 పర్మిషన్ ​తీసుకొని..
సర్కార్​ స్కూళ్ల స్టూడెంట్స్ లో టెక్నికల్​ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేయడానికి వర్క్ చేస్తున్నాం. ఇందులో భాగంగానే స్కూళ్లలో ల్యాబ్ ల ఏర్పాటు, పిల్లలకు కోడింగ్ ట్రైనింగ్, స్టెమ్ కాన్సెప్ట్స్ చెప్తున్నాం.  ముందుగా ఫీల్డ్ సర్వే చేసి,  స్కూల్లోని స్టూడెంట్ సంఖ్యను బట్టి సెలెక్ట్ చేస్తాం. డీఈఓల పర్మిషన్ తీసుకుని ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాం. గ్రేటర్ లో 50 స్కూళ్లలో కోడింగ్ ట్రైనింగ్ ప్రోగ్రాం కొనసాగుతుంది. 
‌‌‌‌– అయూబ్, లెర్నింగ్ స్కిల్ ఫౌండేషన్ మెంబర్​

ఫీడ్ బ్యాక్ ని బట్టి..
ప్రస్తుతం సిటీలోని 20 స్కూళ్లలో ఈ కోడింగ్ ట్రైనింగ్ నిర్వహిస్తున్నాం. గతేడాది 11 స్కూళ్లతో ప్రారంభమైంది. స్టూడెంట్స్, టీచర్లు, హెడ్ మాస్టర్ల అభిప్రాయాలు తీసుకొని ఈ ప్రోగ్రాం కొనసాగించాలా వద్దా అనేది నిర్ణయిస్తాం.   ఎన్జీవోల వాళ్లు స్కూళ్లలో ల్యాబ్ లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. టీచర్లకు టెక్నికల్ నాలెజ్డ్ ఇంప్రూవ్ అయ్యేలా ట్రైనింగ్​ఇస్తున్నారు. 
- రోహిణి, డీఈఓ,హైదరాబాద్