ఖర్జూర గింజలతో కాఫీ పొడి

ఖర్జూర గింజలతో కాఫీ పొడి

చాలామందికి ఉదయం నిద్రలేవగానే కాఫీ తాగకపోతే నడవదు. ఇంకొందరికేమో వర్క్‌‌ చేసేటప్పుడు, స్ట్రెస్‌‌ ఫీల్‌‌ అయినప్పుడు వేడి వేడి కాఫీ గొంతులోకి జారాలి. ఒక్కమాటలో చెప్పాలంటే కాఫీ లేకపోతే బండి ముందుకు జరగదు అన్నట్టు ఉంటుంది కాఫీ లవర్స్‌‌ పరిస్థితి.
కాఫీలో కెఫిన్‌‌ ఉంటుంది. కెఫిన్‌‌ ఎక్కువ తీసుకోవడం వల్ల చాలారకాల హెల్త్‌‌ ప్రాబ్లమ్స్‌‌ వస్తాయని హెల్త్‌‌ ఎక్స్‌‌పర్ట్స్‌‌ చెప్తున్నారు. అయితే కాఫీకి అడిక్ట్‌‌ అయి, అది లేకుండా ఉండలేము అనుకునేవాళ్లు కెఫిన్‌‌ ఫ్రీ కాఫీని తయారు చేసుకోవచ్చు. అదికూడా ఖర్జూర గింజలతో...
ఖర్జూర గింజలతో చేసే కాఫీ పొడి ఎన్నో ఏండ్లనుండి ఉన్నా, ఈ మధ్య సోషల్‌‌ మీడియా వల్ల ‘కెఫిన్‌‌ ఫ్రీ కాఫీ’ ఫేమస్‌‌ అయింది. ఈ గింజలతో చేసిన కాఫీ పౌడర్‌‌‌‌ ఆరోగ్యానికి చాలామంచిదట. ఖర్జూర గింజల్లో ఫాస్ఫరస్‌‌, జింక్‌‌, పొటాషియం, మాంగనీస్‌‌, క్యాల్షియం, ఐరన్‌‌ ఉంటాయి. కెఫిన్​​ ఉండనే ఉండదు.అంతేకాదు ఇది నాన్‌‌– ఎసిడిక్‌‌, గ్లూటెన్‌‌ ఫ్రీ కూడా. ఇన్‌‌స్టంట్‌‌ ఎనర్జీ ఇస్తుందట. ఈ గింజలతో తయారుచేసిన కాఫీ పొడి చూసేందుకేకాదు, రుచి, వాసన సేమ్ కాఫీ పౌడర్‌‌‌‌లాగానే ఉందట. ఈ కాఫీ పౌడర్‌‌‌‌ కావాలంటే షాప్స్‌‌ చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఖర్జూర గింజలు ఇంట్లో ఉంటేచాలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

ఎలా చేయాలంటే..
ఈ కాఫీ పౌడర్‌‌‌‌ తయారీకి కావాల్సినవి ఖర్జూర పండ్లు మాత్రమే. పండు నుండి గింజను తీసేయాలి. గింజలను నీట్‌‌గా కడిగి తుడిచి ఆరబెట్టాలి. తరువాత ఆ గింజలను అరగంట పాటు స్టవ్‌‌ మీద కడాయిలో వేగించాలి. వేగిన గింజలు చల్లారాక, గ్రైండర్‌‌‌‌లో పొడి చేస్తేచాలు కాఫీ పౌడర్‌‌‌‌ రెడీ. 20 ఖర్జూర గింజలతో చేసిన పౌడర్‌‌‌‌తో 4కప్పుల కాఫీ తయారవుతుంది. కాకపోతే తాగేముందు ఒకసారి వడకట్టాలి.