కాలేజీ అమ్మాయిల రక్షణ కోసం కోయంబత్తూరులో మహిళా వింగ్

కాలేజీ అమ్మాయిల రక్షణ కోసం కోయంబత్తూరులో మహిళా వింగ్

కాలేజీ అమ్మాయిల రక్షణ కోసం కోయంబత్తూరు సిటీ పోలీసులు ఓ మహిళా వింగ్ ను ప్రారంభించారు. అదే పోలీస్ అక్కా. యువతుల భద్రత నిమిత్తమైన ఈ ప్రాజెక్టులో భాగంగా మహిళా పోలీసు అధికారులు వారం లేదా 15రోజులకు ఒకసారి కళాశాలను సందర్శించనున్నారని కోయంబత్తూర్ సీపీ వి బాలకృష్ణన్ తెలిపారు. బాలికా విద్యార్థులు సైతం వారిని కలుసుకోవచ్చని, వారి సమస్యలను విన్నవించుకోవచ్చని వెల్లడించారు.

పోలీస్ అక్కా ప్రాజెక్టులో 37మంది మహిళా సిబ్బందిని ఒక బ-ృందంగా ఏర్పాటు చేశారు. వారు నగరంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడంలో కీలక పాత్ర పోషించనున్నారు. ఈ కార్యక్రమానికి మంచి రెస్పాన్స్ వస్తుందని  కమిషనర్ విశ్వాసం వ్యక్తం చేశారు. బాలికలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, వారిలో కొందరు సోషల్ మీడియా బాధితులుగా మారుతున్నారన్నారు.  సమస్యల నుంచి బయటపడేందుకు ఏం చేయాలో, ఎవరిని సంప్రదించాలో తెలియడం లేక సతమతమవుతున్నారని చెప్పారు. కొంతమంది విద్యార్థులు తమ సమస్యలను వారి తల్లిదండ్రులకు చెప్పడానికి సైతం వెనుకాడతారని తెలిపారు.  అయితే విద్యార్థినుల సమస్యలను వినేందుకు మహిళా పోలీసులకు శిక్షణ ఇస్తారని, వారికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి సూచనలవ్వడంలో సహాయం చేస్తారఅని ఆయన వివరించారు.