ఇవాళ డీఐజీ.. మొన్న సీఐ.. పోలీస్ అధికారుల ఆత్మ‌హ‌త్య‌ల వెన‌క కార‌ణం ఏంటీ?

ఇవాళ డీఐజీ.. మొన్న సీఐ.. పోలీస్ అధికారుల ఆత్మ‌హ‌త్య‌ల వెన‌క కార‌ణం ఏంటీ?

తమిళనాడు కోయంబత్తూరులో డిప్యూటి ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్  సి విజయకుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. కోయంబత్తూర్ రేస్ కోర్స్‌లోని తన క్యాంపు కార్యాలయంలో పిస్టల్‌తో కాల్చుకుని సూసైడ్ కు పాల్పడ్డాడు. కుటుంబ సమస్యల కారణంగానే సీ విజయకుమార్ ఆత్మహత్యకు కారణమని అక్కడి పోలీసులు తెలిపారు.

వాకింగ్ వెళ్లి వచ్చి...

డిఐజీ సి. విజయకుమార్ జులై 07వ తేదీ ఉదయం వాకింగ్‌కు వెళ్లి 6.45 గంటలకు తన క్యాంపు కార్యాలయానికి వచ్చాడు. ఆ తరువాత తన పిస్టల్‌ ఇవ్వమని  వ్యక్తిగత భద్రతా అధికారి (పిఎస్‌ఓ)ని కోరాడు. ఆ పిస్టల్ తీసుకుని ఆఫీసు బయటకు వచ్చిన డిఐజీ..6.50 గంటలకు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పిస్టల్ శబ్దానికి సంఘటనా స్థలానికి చేరుకున్న క్యాంపు కార్యాలయంలోని  ఇతర పోలీసులు..సీనియర్ అధికారులకు సమాచారం అందించారు.

మనో వేదనతోనే..

డిఐజీ సి విజయకుమా కొన్నివారాలుగా డిఐజీ తీవ్ర మనోవేదనతో కుమిలిపోతున్నాడని తెలుస్తోంది. తనకు సరిగా నిద్ర సరిగా పట్టడం లేదని.. తన తోటి అధికారులతో చెప్పినట్లు సమాచారం. డిఐజీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోయంబత్తూరు మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు..విచారణ చేపట్టారు.

సి. విజయకుమార్ జనవరి 6, 2023న కోయంబత్తూరు రేంజ్ పోలీసు డిఐజిగా బాధ్యతలు చేపట్టారు. విజయకుమార్ 2009 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయన  గతంలో కాంచీపురం, కడలూరు, నాగపట్నం, తిరువారూరు జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. అనంతరం  చెన్నైలోని అన్నానగర్‌లో డీసీపీ గా విధులు నిర్వర్తించారు. డీఐజీగా పదోన్నతి పొంది కోయంబత్తూరు కు వచ్చారు. 

మొన్న‌టికి మొన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం అన్న‌మ‌య్య జిల్లా తాడిప‌త్రి ప‌ట్ట‌ణ స‌ర్కిల్ ఇన్ స్పెక్ట‌ర్ సైతం ఇంట్లో ఉరి వేసుకుని చ‌నిపోయారు. కుటుంబ క‌ల‌హాల వ‌ల్లే సీఐ ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు పోలీసులు ప్ర‌క‌టించారు. 

వ‌ర‌స‌గా పోలీస్ బాస్ ల ఆత్మ‌హ‌త్య‌లు ఇప్పుడు దేశంలో క‌ల‌క‌లం రేపుతున్నాయి. వారి వారి స్థాయిల్లో ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌టం అనేది ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది. ఇవాళ డీఐజీ స్థాయి అధికారి అయినా.. మొన్న‌టి సీఐ అధికారి అయినా ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు అంటే.. కుటుంబ క‌ల‌హాల‌కు, ఒత్తిడిల‌కు అతీతులు కార‌ని స్ప‌ష్టం అవుతుంది.