కోయంబత్తూర్‌‌‌‌ తొలి మహిళా బస్సు డ్రైవర్‌‌‌‌  రాజీనామా

కోయంబత్తూర్‌‌‌‌ తొలి మహిళా బస్సు డ్రైవర్‌‌‌‌  రాజీనామా

చెన్నై: తమిళనాడులోని కోయంబత్తూరు సిటీ తొలి మహిళా బస్సు డ్రైవర్ షర్మిల శుక్రవారం తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ద్రావిడ మున్నేట్ర కజగం(డీఎంకే) ఎంపీ కనిమొళికి బస్సు టిక్కెట్‌‌‌‌ ఇవ్వడం విషయంలో వివాదం తలెత్తడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. షర్మిల గాంధీపురం నుంచి సోమనూర్ రూట్ లో ఓ ప్రైవేట్ బస్సుకు డ్రైవర్‌‌‌‌గా పనిచేస్తోంది. శుక్రవారం ఉదయం ఎంపీ కనిమొళి తన అనుచరులతో కలిసి గాంధీపురం వద్ద షర్మిల నడుపుతున్న బస్సును ఎక్కారు. షర్మిలను అభినందించి, వాచ్​ను గిఫ్టుగా ఇచ్చారు.

అదే సమయంలో బస్సు కండక్టర్‌‌‌‌గా పనిచేస్తున్న అన్నాతై అనే మహిళ ఎంపీతో పాటు ఆమె అనుచరులను టికెట్ కొనాలని కోరింది. ఎంపీని టికెట్ అడిగిన కండక్టర్‌‌‌‌పై షర్మిల మండిపడింది. దాంతో ఆమెకు, కండక్టర్‌‌‌‌కు మధ్య వాగ్వాదం జరిగింది. దీనిపై కండక్టర్‌‌‌‌ ఫిర్యాదు చేయడంతో యాజమాన్యం షర్మిలను మందలించింది. దీంతో మనస్తాపం చెందిన షర్మిల తన ఉద్యోగానికి రిజైన్ చేశారు.