ఖమ్మంలో చలి పంజా విసురుతోంది. ఉదయం 7 గంటల సమయం వరకు చలి తగ్గక పోవడంతో ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటికి రావడం లేదు. రాత్రి 6 గంటల నుంచే విపరీతమైన చలి మొదలవుతోంది. ఖమ్మం సిటీలో తెల్లవారుజామున పలు సెంటర్లలో చలి మంటలు వేసుకుంటున్నారు. స్వెటర్లకు బాగా గిరాకీ పెరిగింది.
వ్యవసాయ మార్కెట్ కు వచ్చే రైతులు, కూరగాయలు, పాల వ్యాపారులు, పేపర్ బాయ్స్ కు చలితో తిప్పలు తప్పడం లేదు. మరోవైపు ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో చదివే స్టూడెంట్స్ కు ఇంతవరకు స్వేటర్లు, దుప్పట్లు పంపిణీ చేయకపోకడంతో చలికి గజగజ వణుకుతున్నారు. ఈ దృశ్యాలను మంగళవారం ఉదయం ‘వెలుగు’ క్లిక్ మనిపించింది. - వెలుగు ఫొటోగ్రాఫర్, ఖమ్మం
