రాష్ట్రంలో చలి గజ గజ

రాష్ట్రంలో చలి గజ గజ

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. టెంపరేచర్లు సాధారణం కంటే తక్కువగా నమోదువుతున్నాయి. రోజురోజుకూ పడిపోతున్నాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీల వరకూ తగ్గుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోనూ చలి తీవ్రత బాగా పెరిగింది. సాయంత్రం నుంచే చలి వణికిస్తోంది. ఉదయం, రాత్రి మంచు దట్టంగా కురుస్తోంది. సంగారెడ్డిలో 12, వికారాబాద్‌‌లో12.8, ఆసిఫాబాద్‌‌లో13.4, కామారెడ్డిలో13.6, ఆదిలాబాద్‌‌లో13.7, మెదక్‌‌లో13.8, సిరిసిల్ల, రంగారెడ్డిలో14.1, సిద్దిపేటలో14.2, జగిత్యాలలో14.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

నేడు, రేపు మోస్తరు వానలు..

ఉత్తర తమిళనాడు తీరానికి దగ్గరలో నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.  దీంతో మంగళ, బుధవారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌‌ వాతావరణ కేంద్రం తెలిపింది.