హైదరాబాద్ అంత కూల్..​ కూల్..

హైదరాబాద్ అంత కూల్..​ కూల్..

గ్రేటర్ ​వ్యాప్తంగా శనివారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. తెల్లవారు జాము నుంచే నల్లటి మేఘాలు సిటీని కమ్మేశాయి. జల్లులతో మొదలైన వాన కొన్నిచోట్ల దంచికొట్టింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షం పడింది. అత్యధికంగా శేరిలింగంపల్లిలో 2.8 సెంటీమీటర్లు, గచ్చిబౌలిలో 2.7, శివరాంపల్లిలో 2.2 సెంటీమీటర్లు వాన పడింది. మొన్నటిదాకా ఎండలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన జనానికి కూల్​వెదర్ కొంత ఉపశమనాన్ని ఇచ్చింది.

ఉదయాన్నే వర్షం మొదలవడంతో కొన్నిచోట్ల ట్రాఫిక్ జామ్​అయింది. చెట్లు విరిగి పడ్డాయని, రోడ్లపై నీరు నిలిచిందని జీహెచ్ఎంసీకి 31 ఫిర్యాదులు అందాయి. ఆది, సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. సిటీలో ఎల్లో అలెర్ట్(6.4 నుంచి 11.5 సెంటీ మీటర్లు కురిసే చాన్స్) జారీ చేసింది.  - వెలుగు, హైదరాబాద్