నిర్మల్, వెలుగు: ర్యాండమైజేషన్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేసినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మొదటి విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు తొలి దశ ర్యాండమైజేషన్ ను మండలాల వారీగా నిర్వహించామన్నారు. సరిపడా పీవో, ఏపీవోలను నియమించినట్లు పేర్కొన్నారు. అడిషనల్కలెక్టర్(రెవెన్యూ) కిశోర్ కుమార్, డీపీవో శ్రీనివాస్, డీఈవో భోజన్న తదితరులు పాల్గొన్నారు.
పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు చర్యలు
భైంసా, వెలుగు: జిల్లాలో సర్పంచ్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. శుక్రవారం భైంసా మండలంలోని మాటేగాంలో ఏర్పాటు చేసిన నామినేషన్సెంటర్ను తనిఖీ చేశారు. నామినేషన్లకు సంబంధించిన రిజిస్టర్లను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. నామినేషన్ వేసేందుకు వచ్చిన పలువురు అభ్యర్థులతో కలెక్టర్ మాట్లాడారు. బ్యాంక్అకౌంట్తెరవడంలో, కుల ధ్రువీకరణ పత్రాల జారీలో ఎదురైన ఇబ్బందులను ఆమె దృష్టికి తీసుకువచ్చారు. సబ్ కలెక్టర్ సంకేత్కుమార్, ఎంపీడీవో నీరజ్ కుమార్తదితరులున్నారు.
