డ్రైనేజీల్లో పూడిక తీయాలని కలెక్టర్ఆదేశం

డ్రైనేజీల్లో పూడిక తీయాలని కలెక్టర్ఆదేశం

 సీపీతో కలిసి నగర పర్యటన

నిజామాబాద్​, వెలుగు: భారీ వర్షం హెచ్చరిక నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నగరంలోని డ్రైనేజీలను యుద్ధప్రతిపాదికన క్లీన్​చేయాలని కలెక్టర్ వినయ్​కృష్ణారెడ్డి ఆదేశించారు. గురువారం ఆయన సీపీ సాయిచైతన్యతో కలిసి నగరంలోని ఖానాపూర్, నిజాం​కాలనీ, తీన్​కమాన్​, ఐడీఓసీ మురుగు కాల్వలను పరిశీలించారు. 

డ్రైనేజీలు క్లియర్​గా లేకుంటే వర్షం నీరు వెళ్లడానికి దారిలేక కాలనీలు మునుగుతాయని, ఆ పరిస్థితి రాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని నగర పాలక కమిషనర్​దిలీప్​కుమార్​ను ఆదేశించారు. ఎక్కడా సమస్య రాకుండా 
చూడాలన్నారు.

డబుల్​బెడ్రూం ఇండ్లను అర్హులకే కేటాయిస్తాం

నాగారంతో పాటు కలెక్టరేట్​కు సమీపంలో నిర్మించిన 900 డబుల్ బెడ్రూం ఇండ్లను అర్హులకు కేటాయించే ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్​తెలిపారు. ఇండ్లులేని పేద కుటుంబాలను గుర్తించి లిస్టును ఇన్​చార్జ్​మంత్రి సీతక్కకు పంపుతామన్నారు. ఇంటి స్థలం లేని పేదలు, సఫాయి కర్మచారీలు, వితంతులు, ఒంటరి మహిళలకు అలాట్​మెంట్​లో ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఇండ్ల సముదాయంలో రోడ్లు, డ్రైనేజీ, కరెంట్​సౌలత్​ కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కలెక్టర్​వెంట  హౌసింగ్​జిల్లా మేనేజర్​ పవన్​కుమార్, ఆర్డీవో రాజేంద్రకుమార్, ఆర్​అండ్​బీ డీఈ రంజిత్, ఏఈ నివర్తి తదితరులు ఉన్నారు.