టేకులపల్లి, వెలుగు: రైతులు యూరియా బుకింగ్ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్ సూచించారు. శుక్రవారం ఆయన టేకులపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించారు. బొమ్మనపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం బేతంపూడి ఎరువుల గిడ్డంగులు, విక్రయ కేంద్రాలను తనిఖీ చేసి యూరియా, ఎరువుల స్టాక్‌ను పరిశీలించారు. యూరియా బుకింగ్ యాప్ పనితీరును రైతుల మొబైల్ ఫోన్లలో స్వయంగా పరిశీలించారు.
అనంతరం తొమ్మిదోమైలుతండాలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రోగ్రామ్‌ను పరిశీలించి, పలు సూచనలు చేశారు. టేకులపల్లి కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం, జూనియర్ కళాశాలను తనిఖీ చేసి విద్యార్థులకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించారు. తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్‌లను పరిశీలించి, అందుబాటులో ఉన్న పరికరాలను పూర్తిస్థాయిలో వినియోగిస్తూ విద్యార్థినులకు నాణ్యమైన విద్య అందించాలని అధ్యాపకులకు సూచించారు.
