యూపీహెచ్​సీలో మెడిసిన్స్ స్టాక్ ఉంచుకోవాలి

యూపీహెచ్​సీలో మెడిసిన్స్ స్టాక్ ఉంచుకోవాలి
  • హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్

హైదరాబాద్‌, వెలుగు: యూపీహెచ్ సీ(అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్)కు వచ్చే పేషెంట్లకు కావాల్సిన మందులను అందుబాటులో ఉంచుకోవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. తిలక్​నగర్​లోని యూపీహెచ్​సీని బుధవారం ఆయన సందర్శించారు. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది వివరాలను మెడికల్ ఆఫీసర్​ను అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్, పేషెంట్స్ చార్ట్​ను పరిశీలించారు. ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. యూపీహెచ్ సీని విస్తరించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని డీఎంహెచ్ వో వెంకటికి ఆయన సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి శ్రీకళ, మెడికల్ ఆఫీసర్ దీప్తి తదితరులు ఉన్నారు. 

మన బస్తీ – మన బడి పనులు పూర్తి చేయాలి

మన బస్తీ – మన బడి పనులను తొందరగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. కాచిగూడలోని ప్రభుత్వ బాలుర హైస్కూల్ ను ఆయన సందర్శించారు. మన బస్తీ – మన బడి పనులను పరిశీలించి.. అధికారులకు సూచనలు చేశారు. స్కూల్ లోని సమస్యల గురించి స్టూడెంట్లను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట డీఈవో రోహిణి, హెచ్ఎం సుకన్య ఉన్నారు.