10 రోజుల్లో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపిక : ఖమ్మం కలెక్టర్ కలెక్టర్ అనుదీప్

10 రోజుల్లో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపిక  : ఖమ్మం కలెక్టర్ కలెక్టర్ అనుదీప్

ఖమ్మం టౌన్, వెలుగు :  జిల్లాలో పెండింగ్ ఉన్న 1,132 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు రెడీ చేయాలని, లబ్ధిదారుల ఎంపిక 10 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని తన చాంబర్ లో అడిషనల్ కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డితో కలిసి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపై సంబంధిత అధికారులతో మంగళవారం ఆయన రివ్యూ చేశారు. జిల్లాలో 7,229 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు కాగా, 6107 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తయ్యాయని అధికారులు తెలిపారు.

 మిగతా 655 ఇండ్లు పురోగతిలో ఉన్నాయని, 467 ఇండ్ల నిర్మాణం ప్రారంభించలేదని కలెక్టర్ కు నివేదిక అందించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రారంభం కాని 467 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మినహాయిస్తే. ఖమ్మం జిల్లాలో 6.762 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఉంటాయని, వీటిలో 5,630 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పటికే పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేశామని, మిగతా 1,132 ఇండ్లు లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. 

ప్రస్తుతం 260 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీకి సిద్దంగా ఉన్నాయని, 217 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తయినా  మౌలిక వసతులు కల్పించాల్సి ఉందని, 655 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం వివిధ దశలలో ఉన్నాయని చెప్పారు. పూర్తయిన ఇండ్లకు లబ్ధిదారుల ఎంపిక 10 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. మిగిలిన 655 ఇండ్లలో ఇండిపెండెంట్ గా ఉన్న 383 ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించి ఇందిరమ్మ ఇండ్ల నమూనాలో నిర్మించుకునేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో హౌసింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, ట్రైబల్ వెల్ఫేర్, ఎన్​పీడీసీఎల్, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ ఇంజినీరింగ్ అధికారులు,  పాల్గొన్నారు. 

మెరుగైన వైద్య సేవలు  అందించాలి

కూసుమంచి : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని కలెక్టర్ అనుదీప్ డాక్టర్లకు సూచించారు. తిరుమలాయపాలెం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రకృతి వైద్యశాల, సామాజిక ఆర్యోగ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ఆస్పత్రిలో పేషెంట్లకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. మందులు అందుబాటులో ఉండేలా చ ఊడాలన్నారు. ఆస్పత్రి పరిసరాలు శుభంగా ఉంచాలన్నారు.

 సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని సూచించారు. వానాకాలం నేపథ్యంలో సీజనల్​ వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, పేషెంట్లకు కావాల్సిన అన్ని పరీక్షలు చేసి మందులు అందించాలన్నారు. కలెక్టర్​ వెంట వైద్యాధికారులు డాక్టర్లు కృపా ఉషశ్రీ, శ్రీనివాస రావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య, ఎంపీడీవో సిలార్ సాహెబ్, తహసీల్దార్ విల్సన్ ఉన్నారు.