దళిత బంధు లో దళారుల జోక్యం ఉండొద్దు: హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్

దళిత బంధు లో దళారుల జోక్యం ఉండొద్దు: హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్

హైదరాబాద్, వెలుగు: దళిత బంధు రెండో విడత లబ్ధిదారుల ఎంపికలో దళారుల జోక్యం లేకుండా చూడాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. బుధవారం  కలెక్టర్ చాంబర్​ లో నియోజకవర్గ ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. దళిత బంధులో దళారుల ప్రమేయం ఉన్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒంటరి మహిళలు, 60 ఏళ్లు పైబడిన, నియోజకవర్గ పరిధి కాని, దళితులు కాని వారిని ఎంపిక చేయొద్దని సూచించారు. 

అర్హులైన నిరుపేద దళితులను మాత్రమే ఎంపిక చేయాలని స్పష్టంచేశారు.  స్థానిక ప్రజాప్రతినిధులను సంప్రదించి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని, యూనిట్ల పర్యవేక్షణకు అధికారులతో పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గుర్తింపు పొందిన ఏజెన్సీల వద్దనే యూనిట్లు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టంచేశారు. గ్రూప్ గా ఏర్పడి స్థిరమైన ఆదాయం వచ్చే వాటిని ప్రోత్సహించాలని చెప్పారు. అడిషనల్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

మంత్రి తలసానిని కలిసిన కలెక్టర్

కలెక్టర్ అనుదీప్  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రికి మొక్కను అందజేయగా కలెక్టర్ కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్​ముదిరాజ్, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్​కూడా కలెక్టర్ కు విసెష్ చెప్పారు .