
కామారెడ్డి, వెలుగు : సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. మంగళవారం భిక్కనూరు మండలం జంగంపల్లిలోని పల్లె దవాఖానను తనిఖీ చేశారు. మెడిసిన్స్స్టాక్, రిజిస్ట్రర్ను పరిశీలించి మాట్లాడారు. ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఆరోగ్య కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించాలన్నారు. ఇండ్ల పరిసరాల్లో వర్షపు నీరు నిల్వకుండా ప్రజలకు అవగాహన కల్పించి, చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట డీఎంహెచ్వో డాక్టర్ చంద్రశేఖర్ ఉన్నారు.