కామారెడ్డి జిల్లాలో ఇండ్ల నిర్మాణాలు స్పీడప్ చేయాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి జిల్లాలో ఇండ్ల నిర్మాణాలు స్పీడప్ చేయాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు స్పీడప్​ చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు.   సోమవారం పాల్వంచ మండల కేంద్రంలో  ఇండ్ల నిర్మాణాలను పరిశీలించి మాట్లాడారు. మండలంలో 34 ఇండ్లు మంజూరు​ కాగా,  23  ఇండ్ల నిర్మాణాలు షురూ అయ్యాయన్నారు.  మండల స్పెషల్​ అధికారి శ్రీపతి,  తహసీల్దార్ హిమబిందు, ఎంపీడీవో శ్రీనివాస్​ తదితరులు ఉన్నారు.

ఆయూష్మాన్​ సెంటర్ తనిఖీ  

పాల్వంచ మండల కేంద్రంలోని ఆయూష్మాన్​ (సబ్ సెంటర్​)ను సోమవారం కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్  తనిఖీ చేశారు.  సీజనల్​ వ్యాధుల దృష్ట్యా  డాక్టర్లు, స్టాఫ్​అలర్ట్​గా ఉండాలన్నారు.   డీఎంహెచ్​వో డాక్టర్​ చంద్రశేఖర్, అధికారులు ఉన్నారు.