రాకపోకలకు ఇబ్బంది కలుగొద్దు.. వాగుల వద్ద ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి : ఆశిష్ సంగ్వాన్

రాకపోకలకు ఇబ్బంది కలుగొద్దు.. వాగుల వద్ద ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి :  ఆశిష్ సంగ్వాన్
  • వాగుల వద్ద ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి
  • సమస్యాత్మక బ్రిడ్జిల వద్ద బారికేడ్లు పెట్టండి
  • అధికారులకు సూచించిన కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
  • గాంధారి మండలంలో విస్తృత  పర్యటన 

లింగంపేట, వెలుగు : వర్షాలు కురుస్తున్న దృష్ట్యా గ్రామాల మధ్య రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ అధికారులకు సూచించారు. గురువారం గాంధారి మండలంలో 
విస్తృతంగా పర్యటించారు. మండలంలోని తిప్పారంవాగు లోలెవల్​బ్రిడ్జిని పరిశీ లించారు.  ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ వాగులో చెత్తాచెదారం, బురదను  తొలగించాలన్నారు. జిల్లాలో38 సమస్యాత్మక బ్రిడ్జిలు ఉండగా, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 12 ఉన్నాయని, బ్రడ్జిలకు ఇరువైపులా బారికేడ్లు పెట్టాలన్నారు.

 రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్అండ్​బీ, పోలీస్​ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. గాంధారి మండల​ కేంద్రంలో  ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించి ఇసుక, మొరం  సమస్య లేకుండా చూడాలని ఎంపీడీవో, హౌసింగ్​ పీడీ విజయ్​పాల్​రెడ్డికి సూచించారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించి రోగులతో మాట్లాడారు. ప్రభుత్వ జూనియర్​ కాలేజీ ఆవరణలో మొక్కను నాటారు.  కాలేజీ మరమ్మతు కోసం రూ.22 లక్షలు మంజూరైనట్లు చెప్పారు. కాలేజీ సమయంలో ఆర్టీసీ బస్సు వచ్చేలా చూస్తానన్నారు.  

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో స్టూడెంట్లతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు. వివాదంలో ఉన్న  భూములను  రెవెన్యూ, ఫారెస్ట్​ అధికారులతో కలిసి పరిశీలించి రికార్డులను సరిచేయాలని తహసీల్దార్​ రేణుకాచౌహాన్​ను ఆదేశించారు.  కలెక్టర్​ వెంట ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి, హౌసింగ్ పీడీ విజయ్​పాల్​రెడ్డి, డీపీవో మురళి, ఎంపీడీవో రాజేశ్వర్, డీసీహెచ్ఎస్ విజయలక్ష్మి, వైద్యులు సంగీత్​కుమార్, ప్రసన్న, ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ ఆఫీసర్ షేక్​సలాం, డీఆర్డీవో సురేందర్  ఉన్నారు.