
- కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
సదాశివ నగర్, వెలుగు : ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రజలకు సూచించారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పనుల జాతరను ప్రారంభించారు. అనంతరం గ్రామానికి చెందిన చాకలి ఎంకవ్వ పశువుల షెడ్డును ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలన్నారు. అనంతరం ఉపాధి హామీ ద్వారా చేపట్టిన పనులను సమీక్షించారు ఎక్కువ పని దినాలు పూర్తి చేసిన కూలీలు, గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లను సన్మానించారు.
జిల్లావ్యాప్తంగా ఉపాధి పనుల జాతరలో భాగంగా 57 గ్రామపంచాయతీ భవనాలు, 50 అంగన్వాడీ భవనాలు, 134 స్కూల్ టాయిలెట్స్, మూడు ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్లు మూడు కంపోస్ట్ షెడ్లు, 19 కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌లు, 400 పశువుల షెడ్లు, 21 మేకలు, గొర్రెల షెడ్లుప్రారంభించినట్లు తెలిపారు. ఏఎంసీ చైర్మన్ సంగ్యనాయక్ మండల ప్రత్యేకాధికారి సతీశ్‌యాదవ్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సురేందర్, మండల పరిషత్ అధికారి సంతోష్ కుమార్, తహసీల్దార్ సత్యనారాయణ, ఏపీవో శ్రీనివాస్ పాల్గొన్నారు.