4,100 దరఖాస్తుల పరిశీలన పూర్తి : ఆశిష్ సంగ్వాన్​

4,100 దరఖాస్తుల పరిశీలన పూర్తి : ఆశిష్ సంగ్వాన్​
  • కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

లింగంపేట, వెలుగు :  మండలంలో ‘భూభారతి’ కార్యక్రమంలో  4,225 దరఖాస్తులు రాగా,  4,100 దరఖాస్తుల పరిశీలన పూర్తైనట్లు  కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. గురువారం లింగంపేట తహసీల్దార్ ఆఫీస్​లో రెవెన్యూ ఆఫీసర్లు, సిబ్బంది చేపడుతున్న డెస్క్​ వర్క్​  పనులను కలెక్టర్​ పరిశీలించి పలు సూచనలు చేశారు. భూభారతి పైలట్​ ప్రాజెక్ట్​ కింద లింగంపేట మండలంలోని 25 గ్రామాల్లో  రైతు సదస్సులు నిర్వహించామని తెలిపారు.

రెవెన్యూ ఆఫీసర్లు, సర్వే టీం సభ్యులు క్షేత్ర స్థాయిలో దరఖాస్తులను పరిశీలిస్తున్నారని, మిగిలిన 125 దరఖాస్తుల పరిశీలన త్వరలో పూర్తవుతుందన్నారు. కార్య క్రమంలో బాన్సువాడ సబ్​ కలెక్టర్​ కిరణ్మయి, ఎల్లారెడ్డి ఆర్డీవో మన్నె ప్రభాకర్, తహసీల్దార్ సురేశ్, డిప్యూటీ తహసీల్దార్ రాందాస్, ఆర్ఐ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. 

ధాన్యం తూకంలో వేగం పెంచండి

సదాశివనగర్, వెలుగు : అకాల వర్షాలు కురుస్తున్నందున కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకాల్లో వేగం పెంచి మిల్లులకు పంపించాలని కలెక్టర్​ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. గురువారం మండలంలోని  కుప్రియాల్ గ్రామంలో  ఐకేపీ ఆధ్వర్యంలో  కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. కార్యక్రమంలో తహసీల్దార్​ గంగాసాగర్, ఎంపీడీవో సంతోష్​కుమార్, సీసీ దర్ని ఆంజనేయులు పాల్గొన్నారు. బీబీపేట్​ మండలంలోని మాల్కపుర్​, సదాశివనగర్​ మండలంలోని అడ్లూర్​ ఎల్లారెడ్డి, దోమకోండ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను అడిషనల్​కలెక్టర్ వి.విక్టర్  పరిశీలించారు.