వడ్ల కొనుగోళ్లు త్వరగా కంప్లీట్ చేయాలి : ఆశిష్​ సంగ్వాన్​

 వడ్ల కొనుగోళ్లు త్వరగా కంప్లీట్ చేయాలి : ఆశిష్​ సంగ్వాన్​
  • కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ 

కామారెడ్డి​, వెలుగు : వడ్ల కొనుగోళ్లు త్వరగా కంప్లీట్​ చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్​ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం భిక్కనూరు మండలం జంగంపల్లిలోని కొనుగోలు సెంటర్​ను పరిశీలించి మాట్లాడారు. జిల్లాలో ఇప్పటి వరకు 3. 67 లక్షల మెట్రిక్​ టన్నుల వడ్లు కొనుగోలు చేశామన్నారు. నిరుటితో పోలిస్తే 40 శాతం అధికంగా వడ్లు కొనుగోలు చేశామన్నారు.  ఇప్పటి వరకు 70,358 మంది రైతుల నుంచి  851 కోట్ల విలులైన వడ్లను కొనుగోలు చేశామన్నారు.   

దొడ్డు రకం 1.88 లక్ష మెట్రిక్​ టన్నులు,  సన్న రకం 1.78 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు తెలిపారు.   రైతుల అకౌంట్లలో ఇప్పటి వరకు  రూ.762 కోట్లు జమయ్యాయన్నారు.  అకాల వర్షాలు కురుస్తున్నందున సెంటర్లలో త్వరగా కాంటాలు పెట్టి మిల్లులకు తరలించాలన్నారు.   సివిల్ సప్లయ్ డీఎం రాజేందర్, డీఎస్​వో మల్లికార్జున బాబు, డీసీవో రాంమోహన్, తదితరులు ఉన్నారు.  

ఇందిరమ్మ ఇండ్లు త్వరగా నిర్మించుకోవాలి

కామారెడ్డి టౌన్, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా ప్రారంభించాలని కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్ పేర్కొన్నారు. శుక్రవారం  కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్​లో ఇందిరమ్మ  ఇండ్ల లబ్ధిదారులకు పత్రాలు అందజేయటంతో  పాటు,  ముగ్గు పోసి పనులు ప్రారంభించారు.  నిర్మాణ బిల్లులను ప్రతి సోమవారం ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు.  జిల్లాలో 2వ దశలో 11,153 ఇండ్లు మంజూరయ్యాయన్నారు.   కామారెడ్డి నియోజక వర్గంలో 3206,  ఎల్లారెడ్డిలో  3496,  జుక్కల్​లో 3019,  బాన్పువాడలో 1432 ఇండ్లు మంజూరయ్యాయన్నారు. ఇప్పటి వరకు 2,250 ఇండ్లకు ముగ్గు పోసినట్లు తెలిపారు.    హౌజింగ్​ పీడీ విజయ్​పాల్​రెడ్డి, మున్సిపల్​ కమిషనర్​ రాజేంధర్​రెడ్డి,  అధికారులు పాల్గొన్నారు. 

పారిశుధ్య పనులు నిరంతరం కొనసాగించాలి

కామారెడ్డి పట్టణంలో పారిశుధ్య పనులు నిరంతరం కొనసాగించాలని కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్ పేర్కొన్నారు.  శుక్రవారం జిల్లా కేంద్రంలోని వార్డు నంబర్ 17 అశోక్​నగర్​కాలనీ, స్నేహపూరి కాలనీలో పారిశుధ్య పనులను కలెక్టర్ పరిశీలించారు. రోడ్లపై నీరు నిలువకుండా చర్యలు తీసుకొవాలని అధికారులను ఆదేశించారు.   దోమల వ్యాప్తిచెందకుండా ఫాగింగ్​ నిర్వహించాలన్నారు.   ప్రతి రోజు వార్డు ఇన్​చార్జీలు తమ వార్డులో పర్యటించాలన్నారు.  తాగునీటి పైపులైన్లు లీకేజీలు లేకుండా చూడాలన్నారు.  కమిషనర్ రాజేంధర్​రెడ్డి,  ఏఈ శంకర్ తదితరులు ఉన్నారు.