
కామారెడ్డి, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఇసుక, మొరం తెచ్చుకునేందుకు పర్మిషన్ ఉందని, పంచాయతీ సెక్రటరీలకు అప్లికేషన్ ఇవ్వాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. బుధవారం అడిషనల్ కలెక్టర్లు, సబ్ కలెక్టర్, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ఉచితంగా ఇసుక ఇవ్వటానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. రవాణా సౌకర్యాన్ని లబ్ధిదారులు చేసుకోవాలన్నారు. ఇసుక లభ్యత లేని మండలాల్లో పక్క మండలం నుంచి పొందవచ్చన్నారు. మొరం అవసరమైన వారు సెక్రటరీ సిఫారస్సు లేఖతో ట్రాక్టర్‌కు రూ.300, టిప్పర్‌కు రూ.1200 చొప్పున డీడీ చెల్లించి పర్మిషన్ తీసుకోవాలన్నారు. ఇసుక రవాణాపై క్షేత్రస్థాయిలో ఆర్డీవోలు, ఏడీ పర్యవేక్షించాలని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ విక్టర్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, హౌజింగ్ పీడీ విజయ్‌పాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్‌ను కలిసిన మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్..
కామారెడ్డి మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా తాజాగా బదిలీపై వచ్చిన డాక్టర్ బి.వాలియా బుధవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ నుంచి ఇక్కడకు బదిలీపై వచ్చారు.
డిజిటల్ ఎంప్లాయీమెంట్ ఎక్సెంజీ పోస్టర్లను రిలీజ్..
కామారెడ్డిటౌన్, వెలుగు : ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల సమన్వయంతో ఉద్యోగార్థులకు, ఉద్యోగులకు రాష్ర్ట ప్రభుత్వం ప్రారంభించిన డిజిటల్ ఎంప్లాయీమెంట్ ఎక్సెంజీ ఆఫ్ తెలంగాణ అప్లికేషన్లకు సంబంధించిన పోస్టర్లను బుధవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ రిలీజ్ చేశారు. పూర్తి వివరాలను జిల్లా ఇండస్ట్రియల్ ఆఫీస్ కలెక్టరేట్లోని రూమ్ నంబర్ 122లో సంప్రదించాలని
సూచించారు.