
- అధికారులకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశం
కామారెడ్డి, వెలుగు : ప్రతి పల్లెలో శుక్రవారం పనుల జాతర నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనుండడంతో ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ స్కీమ్‌లో అత్యధిక పని దినాలు చేసిన వారిని, దివ్యాంగులను, నిబద్దతతో పని చేసిన మల్టీ పర్పస్ వర్కర్స్, శానిటేషన్ కార్మికులను సన్మానించనున్నట్లు తెలిపారు. జిల్లాలో 3,347 పనులకు గాను రూ. 25 కోట్ల 23 లక్షలు కేటాయించినట్లు తెలిపారు.
రూ. 11 కోట్లతో 57 గ్రామ పంచాయతీ బిల్డింగ్లు , రూ. 60 లక్షలతో 50 అంగన్వాడీ సెంటర్లు, రూ.20 లక్షలతో 2 కిచెన్ షెడ్లు, రూ. 2 కోట్ల 68 లక్షలతో 134 స్కూల్ టాయిలెట్స్, రూ. 40 లక్షలతో 400 పశువుల పాకలు, రూ. 21 లక్షలతో 21 గొర్రెల షెడ్లు, రూ. 27 లక్షలతో 27 కోళ్ల ఫారాలు, రూ. 2 లక్షలతో 13 కంపోస్టు షెడ్లు, రూ. 6 లక్షలతో 32 అజోలా ఇన్ఫ్రా స్ర్టక్చర్స్, రూ. కోటి 71 లక్షలతో 179 హార్టికల్చర్ ప్లాంట్లు, రూ. కోటి 38 లక్షలతో 1,979 సోఫ్ ఫీట్స్, రూ. 3 కోట్ల 95 లక్షలతో 426 డ్రైన్ సోక్ పీట్స్, రూ. కోటి 20లక్షలతో 3 ప్లాస్టిక్ వెస్ట్ మెనేజ్మెంట్, రూ.4. 50 లక్షలతో 3 షెడ్లు, రూ. 57 లక్షలతో 19 కమ్యూనిటీ శానిటరీ కాంపెక్స్ పనులను ప్రారంభించనున్నట్లు వివరించారు. ఆయా గ్రామ సభల్లో స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీవోలు, ఏపీవోలు, ఎంపీవోలు, ఇంజినీర్ అధికారులు, పంచాయతీ సెక్రటరీలు పాల్గొనాలని సూచించారు. సమావేశంలో డీఆర్డీవో సురేందర్, డీపీవో మురళీ తదితరులు పాల్గొన్నారు.