నస్రుల్లాబాద్, వెలుగు: మండలంలోని బొప్పాస్‌పల్లి గ్రామంలో సోమవారం కలెక్టర్ఆశిష్ సంగ్వాన్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల పథకంతో పేదల సొంతింటి కల నెరవేరుతుందన్నారు. లబ్ధిదారులు వేగంగా ఇండ్లు నిర్మించుకోవాలన్నారు.
నిర్మాణ సామగ్రి విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పర్యవేక్షించాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక, మొరం ఉచితంగా అందజేస్తున్నామన్నారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి నిర్మాణాలు ఉండాలని, నిర్మాణాల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, తహసీల్దార్ సువర్ణ, ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.
