- కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి, వెలుగు : మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శనివారం అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. షెడ్యూల్ వెలువడిన వెంటనే ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని, వార్డుల వారీగా ఓటరు జాబితాను ప్రకటించాలన్నారు. క్షేత్రస్థాయిలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించి వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీరు, టాయిలెట్స్, ఫర్నిచర్, కరెంట్, లైటింగ్, ర్యాంపుల వంటి ఏర్పాట్లు చేయాలన్నారు.
ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటించాలని, ప్రతి అంశంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. వివిధ శాఖలకు చెందినవారిని నోడల్ అధికారులుగా నియమించామన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్లు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, వీధి కుక్కల నియంత్రణ, శానిటేషన్ తదితర అంశాలపై చర్చించారు. అడిషనల్ కలెక్టర్ మదన్మోహన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, ఆర్డీవోలు వీణ, పార్థసింహారెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు.
టూరిజం అభివృద్ధికి జాయింట్ సర్వే చేయాలి
టూరిజం అభివృద్ధి కోసం రెవెన్యూ, ఫారెస్ట్శాఖల అధికారులు జాయింట్ సర్వే చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. శనివారం తన చాంబర్లో సంబంధిత అధికారులతో మీటింగ్ నిర్వహించారు. జుక్కల్ మండలం కౌలాస్ కోట గ్రామంలోని చారిత్రక కోట ముందు ఉన్న ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించాలన్నారు. సర్వే నివేదికను త్వరగా సమర్పించాలన్నారు. సబ్ కలెక్టర్ కిరణ్మయి, డీఎఫ్వో నిఖిత, అధికారులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ పరిసరాలను పరిశీలించిన కలెక్టర్
కలెక్టరేట్ పరిసరాలను శనివారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పరిశీలించారు. పార్కింగ్ స్థలం, మెయిన్ గేట్, పార్కులను పరిశీలించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సూచించారు. ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలని తెలిపారు.
