‘భూభారతి’ అప్లికేషన్లు క్షుణ్ణంగా పరిశీలించాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

‘భూభారతి’ అప్లికేషన్లు క్షుణ్ణంగా పరిశీలించాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి​, వెలుగు:‘భూభారతి’ అప్లికేషను క్షుణ్ణంగా పరిశీలిస్తే లబ్ధిదారులకు న్యాయం జరుగుతుందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ రెవెన్యూ అధికారులకు సూచించారు. శుక్రవారం రాజంపేట మండలం ఆరేపల్లిలోని రెవెన్యూ సదస్సుల్లో అప్లికేషన్లను కలెక్టర్ పరిశీలించారు. తలమడ్ల హైస్కూల్, ప్రైమరీ స్కూల్​ను కలెక్టర్​ తనిఖీ చేశారు.  ఎస్సెస్సీ విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు. మ్యాథ్స్​ ప్రాబ్లమ్స్​ను బోర్డుపై రాస్తూ విద్యార్థులతో సాల్వ్ చేయించారు.  7, 9 క్లాస్​ల్లో ఇంగ్లిష్ చదివించారు. 

 మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుండి భోజనం చేశారు.  కిచెన్​ షెడ్డు రిపేర్​ కోసం రూ.50వేలు మంజూరు​ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. ఇండ్ల నిర్మాణానికి మొరం, ఇసుక సమస్య లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.  ఆర్డీవో వీణ, హౌజింగ్​ పీడీ విజయ్​పాల్​రెడ్డి, 
తహసీల్దార్​ జానకి తదితరులు ఉన్నారు.   

ఎరువుల కొరత రాకుండా చర్యలు 

కామారెడ్డి​టౌన్​, వెలుగు : ఎరువులు, విత్తనాల కొరత రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్​ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్​లో అధికారులతో జరిగిన మీటింగ్​లో కలెక్టర్ మాట్లాడారు. విత్తనాలు, ఎరువులు అధిక రేట్లకు అమ్మే ఫెర్టిలైజర్స్​ షాపులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే జిల్లాలో 25వేల మెట్రిక్​ టన్నుల యూరియా  సొసైటీల ద్వారా సరఫరా చేశామని, ఇంకా 8వేల మెట్రిక్​ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జిల్లాలో పామాయిల్​ తోటల పెంపకానికి  చర్యలు తీసుకోవాలన్నారు. అడిషనల్ కలెక్టర్లు విక్టర్, చందర్​నాయక్,  అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్​ తిరుమల ప్రసాద్, జిల్లా హార్చికల్చర్ ఆఫీసర్​ జ్యోతి తదితరులు 
పాల్గొన్నారు.