
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో ఇసుక లభ్యత, పర్మిషన్లకు సంబంధించిన అంశాలపై శుక్రవారం కలెక్టరేట్లో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధ్యక్షతన శాండ్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. బిచ్కుంద మండలం గుండెనెమిలి, హస్గుల్, బీర్కుర్ మండలం కిష్టాపూర్, డొంగ్లి మండలం ఖాత్లెన్, శట్లూర్ లో పట్టా భూముల్లో ఇసుక లభ్యత, పర్యావరణ అనుమతులపై చర్చించారు. అడిషనల్ కలెక్టర్ విక్టర్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా గ్రౌండ్ వాటర్ అధికారి సతీశ్యాదవ్, మైనింగ్ ఏడీ నగేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్సెస్సీ విద్యార్థులపై స్పెషల్ ఫోకస్ పెట్టండి
ఎస్సెస్సీ విద్యార్థులపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన మీటింగ్లో ఆయన మాట్లాడుతూ హెచ్ఎంలు దీనిపై యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ముందుకెళ్లాలన్నారు. మిడ్ డే మిల్స్ నాణ్యతగా అందించాలన్నారు. ప్రైమరీ స్కూల్లో డిజిటల్ ఏఎక్స్ఎల్ కార్యక్రమంలో ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొనేలా చూడాలన్నారు. సబ్ కలెక్టర్ కిరణ్మయి తదితరులు
పాల్గొన్నారు.